Deepika Padukone: 'కల్కి 2898 AD' ఓటీటీలో దీపికా పదుకొనే పేరు మిస్సింగ్..

“కల్కి 2898 AD” ఓటీటీలో దీపికా పదుకొనే పేరు ఎండ్ క్రెడిట్స్‌లో లేకపోవడం అభిమానుల్లో ఆగ్రహం రేపింది. మొదట అభిమానుల ఒత్తిడికి పేరు చేర్చినా, ఇప్పుడు మళ్లీ తొలగించారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీపికా కల్కి రెండో భాగంలో లేని విషయం తెలిసిందే.

New Update
Kalki 2

Deepika Padukone

Deepika Padukone: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైన “కల్కి 2898 AD”(Kalki OTT) సినిమా ఇటీవల మళ్లీ చర్చల్లోకి వచ్చింది. కారణం.. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకోన్ పేరు ఎండ్ క్రెడిట్స్‌లో కనిపించకపోవడమే.

సోషల్ మీడియాలో దీపికా అభిమానులు దీని పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫ్యాన్ “సినిమా చివరలో వచ్చే క్రెడిట్స్ కేవలం పేర్లు కాదు, అవి నటీనటుల కృషికి గుర్తింపు. ‘కల్కి’ సినిమాలో దీపికా పాత్ర కథకు గుండె లాంటిది అలాంటిది, ఆమె పేరు లేకపోవడం చాలా భాధాకార విషయం” అంటూ పోస్ట్ చేశాడు.

మరొకరు “@VyjayanthiFilms మీరు దీపికా పేరును క్రెడిట్స్ నుండి తొలగించారా? ఇది చాలా తప్పు పని. ఒక నటిని పేరు తీసేస్తే, ఆమె చేసిన కృషి కూడా మాయమవుతుందా?” అని ప్రశ్నించారు.

కొంతమంది నెటిజన్లు “మొదట విడుదల సమయంలో పేరు లేకపోయింది. అభిమానుల ఒత్తిడితో తర్వాత చేర్చారు. ఇప్పుడు మళ్లీ తీసేశారు. ఇది చాలా దిగజారుడు పని” అంటూ ఒక యూజర్ కామెంట్ చేసాడు.

మొదటి భాగంలో దీపికా పాత్ర కథకు ప్రధానంగా నిలిచింది. అయితే, రెండో భాగం “కల్కి 2898 AD పార్ట్ 2”లో ఆమె భాగం కాదని నిర్మాతలు అధికారికంగా ధృవీకరించారు. దీని కారణం వెల్లడించకపోయినా, ఈ నిర్ణయంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం దీపికా పదుకోన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ సరసన నటించిన “కింగ్” అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలసి తెరకెక్కిస్తున్న కొత్త ప్రాజెక్టులో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు.

మొత్తానికి, ‘కల్కి 2898 AD’ సినిమాలో దీపికా పేరు ఎండ్ క్రెడిట్స్‌లో లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఆమె చేసిన పాత్రను మరిచిపోవడం కష్టం అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడీ ఘటనతో సినిమా నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు