/rtv/media/media_files/2026/01/06/prabhas-raja-saab-2026-01-06-19-30-52.jpg)
Prabhas Raja Saab
Prabhas Raja Saab: ఇండస్ట్రీలో ప్రభాస్ గురించి ఒక మాట బాగా వినిపిస్తుంది ఆయన ‘డైరెక్టర్స్ హీరో’. అంటే, దర్శకుడు ఒకసారి కథను చెప్పిన తర్వాత, సెట్స్ లో ఏమి చేయమని అడిగినా అది పూర్తి చేస్తారు. ఇతర విషయాల్లో మాత్రం స్వతంత్రంగా జోక్యం చేసుకోరు. అవుట్‌పుట్ విషయంలో కూడా, దర్శకుడి విజన్‌ను పూర్తిగా నమ్మి ఆ ప్రణాళికను అనుసరిస్తారు. ఇదే కారణం, ప్రభాస్‌తో సినిమా చేయడానికి మేకర్స్ ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు.
కానీ ‘ది రాజా సాబ్’ విషయంలో ఈ రూల్ బ్రేక్ చేసాడు డార్లింగ్. ఈ సినిమాకు ప్రభాస్ కేవలం నటనతో పరిమితం కాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ సినిమా ఎడిటింగ్ రూమ్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుస్తోంది. ఆయన ఫైనల్ కట్ పైన నేరుగా పర్యవేక్షణ చేస్తున్నారట. సినిమాలోని ప్రతి చిన్న సన్నివేశం, డీటైల్, టైమింగ్, ఎమోషన్ మొదలైన అంశాలను పూర్తిగా తానే దగ్గరుండి చూసి ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇండస్ట్రీ వర్గాలు, ఫ్యాన్స్ డార్లింగ్ లో ఈ చేంజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గతంలో ప్రభాస్ ఇలా ఎడిటింగ్ లో అంతగా దృష్టి పెట్టలేదు. ఈసారి, హారర్-కామెడీ జానర్ కాబట్టి, టైమింగ్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆయన అనుకుంటున్నట్టు టాక్.
అంతే కాకుండా, ప్రభాస్ ఈ సినిమా పలు సార్లు వీక్షించారు. తనకూ సంతృప్తి కాకపోతే చిన్న మార్పులు కూడా చేయించారు. అలాగే తన నమ్మకమైన టీమ్, క్లోజ్ సర్కిల్ కు ప్రత్యేక స్క్రీనింగ్ ఇచ్చి వారి ఫీడ్‌బ్యాక్ ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇలా చేయడం ద్వారా, ఆవుట్‌పుట్ మరింత షార్ప్, ఎంటర్టైనింగ్ గా మారిందని అంటున్నారు.
ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగి అన్ని ఫైన్ డీటైల్స్ ను చెక్ చేయడం, ఎడిటింగ్, విజువల్స్, ఎంటర్టైన్మెంట్ పార్ట్ పై స్వయంగా తానే శ్రద్ధ వహించడం, సినిమాకు క్వాలిటీ గ్యారంటీ ఇచ్చినట్లే. దర్శకుడు మారుతి కూడా ఫైనల్ కాపీ చూసి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ ఈ సినిమా ఎక్కడా బోర్ కాకుండా, ఎలాంటి స్లో మోమెంట్స్ లేకుండా క్రిస్ప్ గా వస్తుందనే హ్యాపీ అవుతున్నారు.
మొత్తానికి, ప్రభాస్ ఈ అద్భుతమైన కేర్, ఇన్‌వాల్వ్‌మెంట్ సినిమాకు అదనపు ప్లస్ గా మారుతుందని భావిస్తున్నారు. హీరో మాత్రమే కాదు, క్రియేటివ్ విభాగంలో కూడా చూపిన బాధ్యత ఫలితంగా, ‘ది రాజా సాబ్’ ప్రేక్షకులను పూర్తిగా అలరించేలా రూపొందింది. ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Follow Us