Squid Game సిరీస్ కథ నాదే.. కోర్టుకెక్కిన బాలీవుడ్ దర్శకుడు..!

నెట్ ఫ్లిక్స్ పాపులర్ సీరీస్ 'స్క్విడ్ గేమ్' న్యాయపరమైన చిక్కుల్లో పడింది. బాలీవుడ్ దర్శకుడు సోహమ్ షా తన సినిమా 'లక్' కథను కాపీ కొట్టి తీశారని కేసు వేశారు. దీనిపై నెట్ ఫ్లిక్స్ స్పందించింది. సోహమ్ చేసేవి ఆరోపణలేనని, అందులో ఎటువంటి నిజాలు లేవని తెలిపింది.

author-image
By Archana
New Update
Squid Game

Squid Game

Squid Game: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) రూపొందించిన పాపులర్ కొరియన్ సీరీస్ 'స్క్విడ్ గేమ్' న్యాయపరమైన చిక్కుల్లో పడింది. 2021లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయ్యింది. రిలీజైన నెల రోజుల్లోనే 1.65 బిలియన్ వ్యూస్ సాధించింది. అయితే ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు సోహమ్ షా.. ఈ సీరీస్ ను తన సినిమా 'లక్' చూసి కాపీ కొట్టారంటూ ఆరోపణలు చేశారు. అంతే కాదు కాపీ రైట్ ఉల్లంఘన కింద న్యూయార్క్‌లోని ఫెడరల్‌ కోర్టులో దావా వేశారు. ఈ దావాలో 'స్క్విడ్ గేమ్' కథ 'లక్' సినిమా కథకు దగ్గరగా ప్రతిబింబిస్తుందని.. వెంటనే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ నుంచి తొలగించాలని కోరారు.

Also Read: SIIMA Awards 2024: సైమా అవార్డ్స్ వేదిక పై తారల సందడి.. ఫొటోలు వైరల్!

స్పందించిన నెట్ ఫ్లిక్స్

దర్శకుడు సోహమ్ షా కాపీ రైట్ అరోపణల పై తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ స్పందించింది. 'స్క్విడ్ గేమ్' పై వేసిన దావాలో ఎటువంటి వాస్తవం లేదని. సోహమ్ చేసేవి కేవలం ఆరోపణలు మాత్రమేనని తెలిపారు. హ్వాంగ్ డాంగ్ హ్యూక్ 'స్క్విడ్ గేమ్‌' కథను రాసి, రూపొందించారని క్లారిటీ ఇచ్చారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సీజన్ 1 భారీ విజయం తర్వాత మేకర్స్ సెకండ్ సీజన్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సీజన్ 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది.

Also Read :  పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 25 మంది మృతి!

'లక్' మూవీ

సోహమ్ షా తెరకెక్కించిన 'లక్' మూవీలో మిథున్ చక్రవర్తి, శృతి హాసన్, ఇమ్రాన్ ఖాన్, సంజయ్ దత్, డానీ డెంజోంగ్పా, రవి కిషన్, చిత్రాషి రావత్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటి శృతి హాసన్ ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2009 లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

Also Read: Chiranjeevi : కడుపుబ్బా నవ్వించింది..మత్తు వదలరా 2 పై చిరు ట్వీట్!

Advertisment
తాజా కథనాలు