సినిమా రంగాన్ని బతికించండి.. పవన్ దగ్గరకు  ఫిల్మ్ ఛాంబర్!

సినిమా టికెట్ ధరలు ఫ్లెక్సిబుల్ విధానంలో ఉండేలా చూడాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరారు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు గ్రంధి విశ్వనాథ్. సినిమా రంగాన్ని బతికించడానికి ఫెక్సిబుల్ రేట్ల విధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

dted
New Update

Cinema Ticket issue: సినిమా టికెట్ ధరలు ఫ్లెక్సిబుల్ విధానంలో ఉండేలా చూడాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కోరారు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు, పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్. టికెట్ ధరలు ఫ్లెక్సిబుల్ విధానంలో ఉంటేనే చిత్ర పరిశ్రమకు మేలు జరుగుతుందని పవన్ కు వివరించారు. మంగళవారం పవన్ తో భేటీ అయిన విశ్వనాథ్.. ‘తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతోపాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకురావాలి. ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉంది. ఈ అంశాన్ని పరిశీలించండి’అని  విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పూర్ణా పిక్చర్స్ శత వసంతాల సావనీర్ ప్రతిని పవన్ కు అందజేశారు. 

పేద ప్రజలను సినిమాకు దూరం చేస్తోంది..

ఈ సందర్భంగా గ్రంధి విశ్వనాథ్ మాట్లాడుతూ “ఓటీటీలు మాత్రమే కాదు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం కూడా సమంజసంగా లేదు అనే భావన కూడా పేద ప్రజలను సినిమాకు దూరం చేస్తోంది. సినిమా రంగాన్ని బతికించడానికి ఫెక్సిబుల్ రేట్ల విధానం తీసుకొస్తే బాగుంటుంది. దీనిపై ఆలోచన చేయాలి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. కనిష్ఠ, గరిష్ఠ రేట్లను ప్రకటిస్తే సినిమా స్థాయిని బట్టి ఫెక్సిబుల్ రేట్ల విధానంలో ధరలు నిర్ణయించుకుంటారు. చిన్న సినిమాలకు ఈ విధానం వల్ల మంచి కలుగుతుంది. ప్రేక్షకులు కూడా సినిమా హాల్ కు వస్తారు. దీని వల్ల అన్ని స్థాయిల చిత్రాలకు మేలు కలుగుతుంది” అని వివరించారు. ఈ సూచనలు విన్న పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి ఈ వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు.

#ap-ticket-rates-hike #telugu-film-chamber #Dy CM Pawan Kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe