Chiranjeevi MSG: మెగాస్టార్ బాక్సాఫీస్ తుఫాన్.. MSG ప్రీమియర్ కలెక్షన్లతో కొత్త రికార్డు!

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల నుంచే రికార్డులు సృష్టించింది. 24 గంటల్లో 2.87 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రీమియర్‌లతోనే $1.2 మిలియన్ వసూలు చేసింది. సంక్రాంతి సీజన్‌లో సినిమా బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది.

New Update
Chiranjeevi MSG

Chiranjeevi MSG

Chiranjeevi MSG: 

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా నెరవేర్చింది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టుగానే ప్రీమియర్ షోల నుంచే బాక్సాఫీస్ వద్ద సంచలన ఆరంభం నమోదైంది. నిన్న రాత్రి గ్రాండ్‌గా జరిగిన ప్రీమియర్ షోల తర్వాత ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది.

ప్రీమియర్ షోల పరంగా చూస్తే, చిరంజీవి కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్‌గా ‘MSG’ రికార్డు సృష్టించింది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్‌మైషోలో కేవలం 24 గంటల్లోనే 2.87 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. దీనితో ఈ సినిమాపై క్రేజ్ఏ లెవెల్ లో ఉందొ తెలుస్తోంది. ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే, తొలి రోజు కలెక్షన్లు భారీగా ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Chiranjeevi MSG Collections

ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం $1.2 మిలియన్లకు పైగా గ్రాస్ వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక ప్రీమియర్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది. సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో వచ్చే కొన్ని రోజులు కూడా థియేటర్లలో మంచి హౌస్‌ఫుల్ షోలు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన మొదటి సినిమా కావడం విశేషం. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు. సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించారు. అలాగే విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాకు మరో ఆకర్షణగా మారింది.

కథ విషయానికి వస్తే, చిరంజీవి ఇందులో ఎన్ఎస్జీ ఆఫీసర్ శంకర వరప్రసాద్ పాత్రలో నటించారు. ఆయన భార్య ససిరేఖ పాత్రలో నయనతార కనిపిస్తుంది. కొన్ని అపార్థాల కారణంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగి, విడాకులు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత తన వివాహ జీవితం మళ్లీ ఎలా సరిదిద్దుకుంటాడు అనే అంశమే ఈ సినిమా కథాంశం. కుటుంబ విలువలు, భావోద్వేగాలు, వినోదం అన్నీ కలిసిన కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

మొత్తానికి, మెగాస్టార్ చిరంజీవి స్టామినా మరోసారి బాక్సాఫీస్ వద్ద రుజువైంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా తొలి రోజే రికార్డులు తిరగరాస్తూ, పండుగ సీజన్‌లో బలమైన లాంగ్ రన్ వైపు దూసుకుపోతోంది. ప్రేక్షకులు కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా కావడంతో రాబోయే రోజుల్లో కూడా మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు