టైం చూసి దెబ్బకొట్టిన చిరు.. అల్లు అర్జున్ కి బిగ్ షాక్ సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో నేడు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ కానున్నారు. అయితే ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి రావడం లేనట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు ఆహ్వానించగా.. చిరంజీవి చెన్నైలో ఉండటం వల్ల రావడం కుదరదని చెప్పినట్లు సమాచారం. By Archana 26 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update chiranjeevi షేర్ చేయండి Chiranjeevi: ఈరోజు సినీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత సినీ ఇండస్ట్రీలో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ భేటీకి టాలీవుడ్ పెద్ద మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడంలేదని తెలుస్తోంది. దిల్ రాజ్ చిరంజీవి ఆహ్వానించగా.. చెన్నైలో ఉండటం వల్ల రావడం కుదరదని చెప్పినట్లు సమాచారం. మెగా వర్సెస్ అల్లు అంటూ సోషల్ మీడియాలో వివాదం జరుగుతున్న వేళ చిరంజీవి భేటీకి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు? సీఎం రేవంత్ కలవనున్న సినీ ప్రముఖులు ఈ భేటీకి నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ హాజరుకానున్నారు. అదే సమయంలో డైరెక్టర్స్ విషయానికొస్తే.. త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీపైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట వెళ్లనున్నట్లు సమాచారం. ఇక ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్ , గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్ , కె.ఎల్ నారాయణ, మైత్రీ రవి, నవీన్ సీఎం రేవంత్ ని కలవడానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి