Chiranjeevi: చిరంజీవి భుజానికి సర్జరీ.. అసలు కారణం ఏమిటి?

అల్లు శిరీష్ పెళ్లి ఆహ్వాన వేడుకలో చిరంజీవి చేతికి పట్టీతో కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. తరువాత ఆయన భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం బాగానే ఉన్నానని తెలిపారు. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

New Update
Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: మెగా కుటుంబంలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే రామ్ చరణ్‌కు కవలలు పుట్టడంతో కుటుంబంలో ఆనందం మరింత పెరిగింది. ఇదే సమయంలో అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ తన పెళ్లి వార్తతో అందరినీ ఆశ్చర్యపరిచారు. మార్చి 6న జరగనున్న తన వివాహానికి సంబంధించిన మొదటి ఆహ్వాన పత్రికను చిరంజీవి, సురేఖ దంపతులకు అందజేశారు.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోల్లో చిరంజీవి ఎడమ చేతికి హ్యాండ్ సపోర్ట్ బెల్ట్ ధరించి కనిపించడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. షూటింగ్ సమయంలో గాయమైందా? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా? అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.

Chiranjeevi Hand Surgery

ఈ చర్చల మధ్య చిరంజీవి స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. తన భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం బాగానే ఉన్నానని తెలిపారు. ఆర్థోస్కోపీ సర్జరీ విజయవంతంగా చేసిన డాక్టర్ నితిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు.

చేతికి పట్టీ ఉన్నప్పటికీ, ఆయన బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి అభిమానులతో ఫోటోలు దిగారు. ఫోటోలకు పోజ్ ఇచ్చేటప్పుడు కూడా పట్టీని తీసి అభిమానులను సంతోషపరిచారు.

ఇటీవలే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న చిరంజీవి, ఇప్పుడు కుటుంబ ఆనందాల మధ్య కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు