Jailer 2: రజినీతో స్టెప్పులేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ.. 'కావాలయ్యా' మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా..?

రజనీకాంత్ ‘జైలర్ 2’లో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. చెన్నైలో భారీ పాట షూటింగ్ జరుగుతుందని సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 12న విడుదల కానుంది.

New Update
Jailer 2

Jailer 2

Jailer 2: రజనీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ చిత్రం ‘జైలర్ 2’పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో హాట్ టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి ఈ సినిమాలో ఒక ప్రత్యేక డ్యాన్స్ పాటలో కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

సినిమా యూనిట్‌కు దగ్గరైన వర్గాల సమాచారం ప్రకారం, నోరా ఫతేహి ప్రస్తుతం చెన్నైలో ఓ అవుట్‌డోర్ డ్యాన్స్ పాట షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది ఫుల్ ఎనర్జీతో కూడిన పాటగా ఉండనుందని తెలుస్తోంది. ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేస్తున్నారని సమాచారం. సౌత్ స్టైల్‌లో ఉండే ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని అంటున్నారు.

Nora Fatehi Special Song in Rajinikanth Jailer 2

ఈ పాట షూటింగ్ మొత్తం ఎనిమిది రోజుల పాటు జరుగుతుందట. ముఖ్యంగా ఈ డ్యాన్స్ నంబర్‌లో నోరా ఫతేహి రజనీకాంత్‌తో కలిసి నటించడం విశేషం. ఈ పాటను 2026లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ‘జైలర్’ సినిమాలో తమన్నా చేసిన ‘కావాలయ్యా’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో నోరా ఫతేహి పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.

‘జైలర్ 2’లో రజనీకాంత్ మరోసారి ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగంలో ఆయన భార్య పాత్రలో నటించిన రమ్యకృష్ణ కూడా ఈ సీక్వెల్‌లో కొనసాగనున్నారు. గత సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తిరిగి కనిపించే అవకాశముందని వార్తలు ఉన్నాయి. అలాగే బాలకృష్ణ, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే వినాయకన్, సూరజ్ వెంజరమూడ్, సంతానం ఈ సినిమాలో భాగమని తెలిపారు. నటి మేఘనా రాజ్ సర్జా కీలక పాత్రలో తమిళ సినిమాల్లోకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. ‘అంగమలై డైరీస్’తో గుర్తింపు పొందిన మలయాళ నటి అన్నా రాజన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ విజయ్ కార్తిక్ కన్నన్ చేస్తుండగా, ఎడిటింగ్ ఆర్. నిర్మల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా 2026 జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

నోరా ఫతేహి ఇప్పటివరకు దాదాపు 18 ప్రత్యేక పాటల్లో నటించారు. త్వరలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాంచన 4’తో ఆమె తమిళ నటిగా అరంగేట్రం చేయనున్నారు. అలాగే ‘కేడీ: ది డెవిల్’ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Advertisment
తాజా కథనాలు