/rtv/media/media_files/2026/01/24/mouni-roy-2026-01-24-19-32-40.jpg)
Mouni Roy
Mouni Roy: బాలీవుడ్ నటి మౌనీ రాయ్ తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. హరియాణాలోని కర్నాల్ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కొందరు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఈవెంట్‌లో తాత వయసున్న ఇద్దరు వ్యక్తులు ఫోటోలు తీసే పేరుతో తనను ఇబ్బంది పెట్టారని మౌనీ రాయ్ తెలిపారు. వేదికపైకి వెళ్లే సమయంలో వారు తమ చేతులతో తన నడుమును తాకారని చెప్పారు. వెంటనే వారిని చేతులు తీసేయాలని కోరినా, వారి ప్రవర్తనలో మార్పు రాలేదని ఆమె అన్నారు.
Mouni Roy Harassed on Stage
#MouniRoy harassed by 2 aged men in Haryana 🫣🤯
— $@M (@SAMTHEBESTEST_) January 24, 2026
"I'm disgusted with the behaviour of the guests specially two uncles who are well aged to be grandparents. uncles and family members (all men) put their hands on my waist to click pictures"- Mouni Roy. pic.twitter.com/FB0b0jdfOV
స్టేజ్‌పై ఉన్న సమయంలో కూడా ఆ ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా సైగలు చేస్తూ, లో యాంగిల్‌లో వీడియోలు తీశారని పేర్కొన్నారు. ఈ కారణంగా తాను చాలా అసౌకర్యానికి గురయ్యానని, ముందుగా అనుకున్న సమయానికి ముందే ప్రదర్శనను ముగించాల్సి వచ్చిందని తెలిపారు.
ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు గానీ, ఈవెంట్ నిర్వాహకులు గానీ వారిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని మౌనీ రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి వారికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే, కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉందన్నారు.
తాను అక్కడ చాలా అవమానం భరించిందని, ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తాము నిజాయతీగా పని చేసే కళాకారులమని, ఇతరుల కార్యక్రమాల్లో అతిథులుగా పాల్గొంటామని, అలా వచ్చిన వారిని వేధించడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు.
‘నాగిని’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనీ రాయ్, ‘గోల్డ్’, ‘మేడ్ ఇన్ చైనా’, ‘బ్రహ్మాస్త్ర’, ‘ది భూత్నీ’ వంటి సినిమాల్లో నటించారు. అలాగే ‘రన్’, ‘కేజీఎఫ్ 1’ (కన్నడ), ‘వేదా’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో మౌనీ రాయ్ కనిపించనున్నారు.
Follow Us