చీటింగ్ కేసులో ప్రముఖ నటుడికి ఢిల్లీ కోర్టు నోటీసులు!

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర చిక్కుల్లో పడ్డారు. చీటింగ్ కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ధర్మేంద్రకు నోటీసులు జారీ చేసింది. గరంధరం దాబా ఫ్రాంచైజీ డీల్ కి సంబంధించి తనను మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సుశీల్ కుమార్ అతనిపై ఫిర్యాదు చేశారు.

New Update
dharmendra

Dharmendra

Dharmendra: నటుడు ధర్మేంద్ర తన రెస్టారెంట్ 'గరం ధరమ్ ధాబా' ఫ్రాంచైజీకి సంబంధించి చిక్కుల్లో పడ్డారు. ఫ్రాంచైజీ సంబంధించిన  చీటింగ్ కేసులో ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సమన్లు ​​జారీ చేసింది. ఫ్రాంచైజీ పెట్టుబడి విషయంలో తనను తప్పుదోవ పట్టించారని ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త సుశీల్‌ కుమార్‌ ధర్మేంద్ర పై ఫిర్యాదు చేశారు. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న జరగనుంది. 

ధర్మేంద్ర మోసం చేశాడు.. 

అయితే 2018లో  ధర్మేంద్ర  ఉత్తర్ ప్రదేశ్ లోని  'గరం ధరం' దాబా ఫ్రాంచైజీలో భాగం కావాలని వ్యాపారవేత్త  సుశీల్‌ కుమార్‌ ని కోరారట.  రెస్టారెంట్ నుంచి నెలకు రూ.70 లక్షల వరకు టర్నోవర్‌ వస్తుందని ధర్మేంద్ర చెప్పడంతో సుశీల్‌ కుమార్‌ పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఈ డీల్ కి సంబంధించి ఒప్పంద పత్రంపై సంతకం కూడా చేసుకున్నారట. కానీ ఆ తర్వాత ధర్మేంద్ర నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో..  తాను మోసపోయానని తెలుసుకొని కోర్టును ఆశ్రయించినట్లు సుశీల్‌ కుమార్‌ ఫిర్యాదులో ఇలా పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు