Mithun Chakraborty : బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. భారతీయ సినీ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందుకోనున్నారు. అక్టోబర్ 8 2024న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ అవార్డును మిథున్ చక్రవర్తికి ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ''మిథున్ అద్భుతమైన చలన చిత్ర ప్రయాణం అనేక తరాలకు స్ఫూర్తినిస్తుందని. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి మిథున్ చక్రవర్తికి అవార్డు ఇవ్వాలని దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ నిర్ణయం తీసుకోవడం గర్వంగా ఉంది అని ట్వీట్ చేశారు.''
370 సినిమాల్లో..
మిథున్ చక్రవర్తి హిందీ, తమిళం మరియు బెంగాలీ, తెలుగు సహా మొత్తం 370 సినిమాల్లో పనిచేశారు. ఆయన 1976లో సినీ ప్రస్థానం మొదలు పెట్టారు. 1976లో తొలి సినిమా ‘మృగయ’ కెరీర్ ను ప్రారంభించారు. ఈ మూవీలో మిథున్ అత్యత్తమ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు వరించింది. ఆ తర్వాత ఆయన ఎక్కడా కూడా వెనుదిరిగి చూడలేదు. 1982లో విడుదలైన 'డిస్కో డాన్సర్' అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. 100 కోట్ల బిజినెస్ చేసిన తొలి సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. దీంతో మిథున్ చక్రవర్తి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగిపోయారు.
దాదాపు 50 ఏళ్ల సినీ కెరీర్ లో మిథున్ చక్రవర్తి హిందీ, తమిళం మరియు బెంగాలీ, తెలుగు సహా మొత్తం 370 సినిమాల్లో నటించారు. అయితే ఇందులో 180 సినిమాల వరకూ ప్లాపులే ఉన్నట్లు టాక్. అయినా సరే ఆయన స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గలేదు. నటుడిగా ఇండస్ట్రీలో స్టార్ గుర్తింపు తెచ్చుకున్న మిథున్ చక్రవర్తి 2021 లో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఎంపీ అభ్యర్థిగా తన సేవలు అందిస్తున్నారు.
Also Read : స్కూల్ బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి దుర్మరణం