Bigg Boss: దసరా పండగ సందర్భంగా బిగ్ బాస్ టీమ్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసింది. ఈ మేరకు తాజాగా లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో 'తెలుసు కదా' మూవీ టీమ్ సిద్దూ జొన్నలగడ్డ, రీతూ చౌదరీ, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. అనంతరం హోస్ట్ నాగార్జున హౌజ్ మేట్స్ తో కొన్ని ఫన్నీ టాస్కులు ఆడించారు. ఇందులో భాగంగా నాగార్జున బిగ్ బాస్ ఇంట్లో నడుస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి చెప్పాలంటూ దివ్య నిఖితను అడిగారు. దీంతో నిఖిత అంతా బయటపెట్టింది. ''ముందు పవన్- రీతూ క్లోజ్ అయ్యారు.. ఇంతలో డెమోన్ రీతూకి క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేశాడు''.. ఇలా వీళ్ళ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ ట్రాక్ నడుస్తోంది అంటూ కుండ బద్దలు కొట్టింది నిఖిత. అప్పుడప్పుడు ఈ ట్రయాంగిల్ ట్రాక్ క్వాడ్రా (4) కూడా అయ్యిందంటూ చెప్పుకొచ్చింది. మధ్యలో పవన్ తనూజతో క్లోజ్ అవడానికి ట్రై చేశాడు. కానీ, అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు అని తెలిపింది.
ఏడ్చిన డెమోన్..
దసరా సందర్భంగా కంటెస్టెంట్లకు స్పెషల్ గిఫ్ట్స్ గెలుచుకునే అవకాశం కల్పించారు హోస్ట్ నాగార్జున. అయితే ఈ గిఫ్స్ గెలుచుకోవడానికి 'తగ్ ఆఫ్ వార్ టాస్క్' టాస్కులో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో గెలిచినవారు గిఫ్ట్ సొంతం చేసుకొని.. తమకు ఇష్టమైన వారికి ఇవ్వొచ్చని అనౌన్స్ చేశారు. ఈ టాస్కులో గెలిచిన డెమోన్ రీతూ కోసం గిఫ్ట్ తీసుకుంటాడు. కానీ రీతూ మాత్రం.. ''నాకు కాకపోతే వేరే వాళ్లకు ఇచ్చేవాడు'' అంటూ డెమోన్ బాధపెట్టింది. దీంతో డెమోన్ ''నేను జెన్యూన్ గా తనతో ఫ్రెడ్షిప్ చేశాను.. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయిన ఆమె అర్థం చేసుకుంటే చాలు'' అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
రీతూ మదర్ కాల్
అనంతరం హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు ఇంటి నుంచి వచ్చిన మెసేజెస్ వినిపించారు. ప్రోమోలో రీతూ మదర్ మెసేజ్ వినిపించగా.." నీ ఆటపై మాత్రమే ఫోకస్ చేయ్.. పక్కనవాళ్ళ కోసం ఆడకు... గేమ్ పై ఫోకస్ పెట్టు అంటూ ఇండైరెక్ట్ గా డెమోన్ పవన్ గురించి హింట్ ఇచ్చారు రీతూ అమ్మ. డెమోన్ పవన్ తో డిస్టెన్స్ మెయింటైన్ చేయ్ అన్నట్లుగా చెప్పారు. మరి ఈ విషయం రీతూకి అర్థమై తన గేమ్ చేంజ్ చేసుకుంటే.. ఎక్కువ రోజులు సర్వైవ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని నెటిజన్ల అభిప్రాయం.