బిగ్‌బాస్‌లో మత రచ్చ! మెహబూబ్, నబీల్ ఇద్దరికీ రెడ్ కార్డు.. నెటిజన్ల ట్రోల్స్

బిగ్‌బాస్ సీజన్ 8 మత రచ్చకు దారి తీసింది. నబీల్, మెహబూబ్ మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. "మన మతం ఓట్లన్నీ మనకు పడతాయి.. ఒకవేళ ఇద్దరం నామినేషన్స్‌లో ఉంటే ఆ ఓట్లు డివైడ్ అవుతాయి" అని చర్చించుకున్నారు. దీంతో వీరిద్దరిపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.

New Update

Bigg Boss Telugu 8:  గత సీజన్స్ లో  ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 6 వారాలు పూర్తయిన ఈ షోలో బేబక్క, సీతా, ఆదిత్య ఓం, నైనికా, సోనియా ఎలిమినేట్ అయ్యారు. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ తర్వాత మెహబూబ్- నబీల్ మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిటీ పేరును తీస్తూ వీరిద్దరూ ఓట్ల గురించి మాట్లాడుకోవడం వీడియోతో సహా నెట్టింట  వైరల్ అవుతుంది.

మన కమ్యూనిటీ ఓట్లన్నీ మనకే 

నామినేషన్ ప్రక్రియ తర్వాత నబీల్, మెహబూబ్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ క్రమంలో మెహబూబ్ నబీల్ తో మాట్లాడుతూ.. మనకు  ప్లస్ ఏంటంటే మనకు మన కమ్యూనిటీ ఉంది. మన కమ్యూనిటీ ఓట్లన్నీ మనకే పడతాయి. కాకపోతే మనిద్దరం ఒకేసారి నామినేషన్స్ లోకి రాకుండా చూసుకోవాలి. ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి. ఇద్దరం కమ్యూనిటీ(ముస్లిం)  ఓట్లు డివైడ్ అవుతాయి" అంటూ గేమ్ లో కి కమ్యూనిటీని తీసుకొచ్చారు.

సోషల్ మీడియాలో విమర్శలు  

అయితే ఈ సంభాషణ ఎపిసోడ్ లో టెలికాస్ట్ కాకపోయినా.. లైవ్ లో రావడంతో.. వీడియోను కట్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరిపై సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు  వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళను రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపాలని కామెంట్స్ చేస్తున్నారు. అలా మాట్లాడకూడదని కాస్త సెన్స్ కూడా లేదు అని అంటున్నారు. మరికొంతమంది గేమ్ లో కి కమ్యూనిటీ అని తీసుకురావడం అసలు సరైనది కాదు అంటూ విమర్శిస్తున్నారు. 

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో రూల్స్ ప్రకారం కొన్ని విషయాలు గురించి అస్సలు మాట్లాడకూడదు.  ముఖ్యంగా మతం, కులం.. ఇలాంటి ప్రస్తావన అసలే ఉండదు. అలాంటిది నబీల్, మెహబూబ్  కమ్యూనిటీ పేరుతో ఓట్ల గురించి మాట్లాడం వైరల్ గా మారింది. దీని పై బిగ్ బాస్, నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

Also Read:  ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe