వాడి ట్రాప్ లో పడకు.. నిఖిల్ పై మాటలతో రెచ్చిపోయిన సీత..!

బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో సీత, మణికంఠ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. సీత యష్మిని నామినేట్ చేస్తూ ఆమెకు కొన్ని సలహాలు ఇచ్చింది. నిఖిల్ ట్రాప్ లో పడకు.. అతన్ని ఇష్టపడడం మొదలు పెట్టిన తర్వాత నీ గేమ్ కనిపించడం లేదు అంటూ చెప్పింది.

New Update

Bigg Boss Telugu 8:  బిగ్ బాస్ హౌస్ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సారి బిగ్ బాస్ కాస్త బిన్నంగా నామినేషన్ ప్రక్రియను ఏర్పాటు చేశాడు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్.. ప్రస్తుతం హౌజ్ ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసే విధంగా ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో సోనియా, బేబక్క, శేఖర్ భాష.. నిఖిల్, ప్రేరణ, యష్మీ, పృథ్వీని నామినేట్ చేసి వెళ్లిపోయారు.  

Also Read: గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి

వాడి ట్రాప్ లో పడకు

ఇది ఇలా ఉంటే తాజాగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో ఎక్స్ కంటెస్టెంట్స్ కిర్రాక్ సీత, మణికంఠ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు కూడా నిఖిల్, యష్మీ, పృథ్వీ, ప్రేరణనే టార్గెట్ చేసినట్లుగా ప్రోమోలో కనిపించింది. మణికంఠ నిఖిల్ ని నామినేట్ చేయగా.. సీత యష్మీ, ప్రేరణను నామినేట్ చేసింది. అయితే  సీత..  యష్మీని నామినేట్ చేస్తూనే నిఖిల్ పై కూడా రెచ్చిపోయింది. నిఖిల్ గురించి యష్మీకి సలహాలు ఇచ్చింది. నిఖిల్ ని ఇష్టపడడం మొదలు పెట్టిన తర్వాత.. నీ గేమ్ పోయింది. దయచేసి ఆ ట్రాప్ లో పడకు.. అతను తెలివిగా స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేసి గేమ్ డౌన్ చేస్తున్నట్లు నాకు అనిపించింది అంటూ చెప్పింది. దీనికి నిఖిల్ కూడా సీతకు కౌంటర్ ఇచ్చాడు. ట్రాప్ లో పడేసి.. గేమ్ డౌన్ చేయడానికి ఇక్కడెవరూ చిన్నపిల్లలు కాదు అంటూ చెప్పాడు. 

Also Read :  ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు