అవినాష్ వెకిలి కామెడీ.. ఇంటి నుంచి వెళ్లిపోతానని గౌతమ్ మాస్ వార్నింగ్..! బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ అంతా ఒక ఫన్ టాస్క్ లో పాల్గొంటారు. ఈ క్రమంలో అవినాష్.. 'అశ్వత్థామ 2.0' అంటూ గౌతమ్ పై వెకిలి కామెడీ చేయడంతో అతను సీరియస్ అయినట్లుగా చూపించారు. ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి. By Archana 09 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update Bigg Boss Telugu 8 promo షేర్ చేయండి Bigg Boss Telugu 8 promo: వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో బిగ్ బాస్ సీజన్ 8 మరింత ఆసక్తికరంగా మారింది. రాయల్ vs ఓజీ క్లాన్ అంటూ గేమ్ ను ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. పృథ్వీ, సీత, విష్ణు ప్రియా, యష్మీ, మెహబూబ్, గంగవ్వ ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఇక తాజాగా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశాడు. ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ అంతా ఒక ఫన్ టాస్క్ లో పాల్గొంటారు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ రోహిణి, అవినాష్ లు హౌస్ మేట్స్ ను నవ్వించాలని చెప్పారు. ఇందులో భాగంగా అవినాష్, రోహిణీ ఇద్దరు మిగతా ఇంటి సభ్యులను నవ్వించడానికి కామిడీ చేయడం, పాటలు పాడడం చేశారు. అవినాష్ వెక్కిలి కామెడీ.. గౌతమ్ కృష్ణ మాస్ వార్నింగ్ ఇంటి సభ్యులను నవ్వించే క్రమంలో ముందుగా అవినాష్ మణికంఠను ఇమిటేట్ చేస్తూ అతను పాడిన 'అఖిల బ్రహ్మాండ కోటీ’ పాటను హేళనగా పాడుతూ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక అవినాష్ కామెడీకి మణికంఠ కూడా నవ్వేశాడు. ఆ తర్వాత అవినాష్ గౌతమ్‌ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అశ్వత్థామ 2.0 వచ్చాడూ అంటూ కామెడీ చేశాడు. కానీ గౌతమ్ మాత్రం దీన్ని కామెడీగా తీసుకోలేదు.. హేళనగా ఫీల్ అయ్యాడు. దీంతో అవినాష్ పై ఫుల్ సీరియస్ అయ్యాడు. ''దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఇరిటేట్ చేయకండి.. ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను'' అంటూ మైక్ తీసి విసిరికొట్టాడు. అయితే గత సీజన్ లో అశ్వత్థామ 2.0 అంటూ గౌతమ్ ఓ రేంజ్‌లో ట్రోల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అవినాష్ మళ్ళీ అదే విషయాన్ని తీసుకొచ్చి వెక్కిలి చేయడం తట్టుకోలేకపోయాడు. మరి ఈ గొడవ ఎంత దూరం వెళ్లిందో చూడాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. Also Read: రేపే సద్దుల బతుకమ్మ .. సంబరాలతో మారుమోగనున్న తెలంగాణ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి