Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 వారాలు పూర్తి చేసుకొని 9వ వారంలో అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన మెహబూబ్ ఎలిమినేట్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో అవినాష్ బయటకు వెళ్లిపోవడంతో కంటెస్టెంట్స్ అంతా ఎమోషనల్ గా ఫీల్ అవడం చూపించారు.
Also Read: పుష్ప2 క్రేజ్.. ఏకంగా 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్.. RRR రికార్డ్స్ బ్రేక్
బయటకు వెళ్లిన అవినాష్
అయితే కడుపు నొప్పి అని మెడికల్ రూమ్ కి వెళ్లిన అవినాష్.. అనారోగ్య కారణాల చేత అనుకోని పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లుగా ప్రోమోలో చూపించారు. అవినాష్ వెళ్లడంతో నయని, రోహిణి, టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిగతా హౌస్ మేట్స్ అంతా కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అవినాష్ తన కామెడీతో ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్స్ ను కూడా బాగా ఎంటర్ టైన్ చేసేవాడు. ఇప్పుడు అవినాష్ సడెన్ గా వెళ్లిపోవడం అందరికీ షాకిచ్చింది. అయితే కొంతమంది మాత్రం ఇదంతా బిగ్ బాస్ ప్రాంక్ అని అంటున్నారు. మరి ఇది ప్రాంకా? నిజమా? అనేది తెలియాలంటే నైట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా
గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ రావడంతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే 8 వారాలు పూర్తవగా.. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు.
Also Read: Venkatesh: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?