BIG BREAKING: బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వకు గుండెపోటు !

బిగ్ బాస్ సీజన్ 8 లో అనూహ్య పరిణామం చేసుకున్నట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డు ఎంట్రీగా ఇంట్లోకి వెళ్లిన గంగవ్వకు గుండెపోటు వచ్చిందట. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

New Update

Gangavva:  ఒకప్పుడు వ్యవసాయ కూలీ అయిన గంగవ్వ.. ఇప్పుడు అతి పెద్ద సెలెబ్రెటీగా మారింది. 'మై విలేజ్ షో'  అనే ఛానెల్ లో పల్లెటూరి వీడియోలో చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. 60 ఏళ్ళ వయసులో కూడా చలాకీగా వీడియోలు చేస్తూ, గలగలా మాట్లాడే గంగవ్వ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది. అదే పాపులారిటీ తో  బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 4లో నాలుగు వారాలు పాటు బాగానే సందడి చేసిన గంగవ్వ..  ఆ తర్వాత హౌస్ వాతావరణం పడక ఆమె ఆరోగ్యం దెబ్బతింది. దీంతో అవ్వ మధ్యలోనే హౌస్ లో నుంచి బయటకు వచ్చేసింది. 

gangavva 1

మళ్ళీ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ 

అలా సీజన్ 4లో అనుకోని పరిస్థితుల కారణంగా షో మధ్యలోనే వెళ్ళిపోయిన గంగవ్వకు.. బిగ్ బాస్ మరోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఇక వచ్చిన మొదటి రోజే అవ్వ.. అవినాష్ టాస్క్ ఆడి గెలిచి సూపర్ అనిపించుకుంది. టాస్కుల్లో పెద్దగా ఆడకపోయిన తన శక్తికి తగట్టు అక్కడక్కడ కామెడీ, పంచులు వేస్తూ బాగానే అలరిస్తోంది అవ్వ. 

Also Read: Sarfaraz Khan : తండ్రైన ఇండియన్ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఇన్స్టాలో పోస్ట్!

గంగవ్వకు గుండెపోటు 

అయితే తాజాగా గంగవ్వకు సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. గత రాత్రి బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వకు గుండెపోటు వచ్చినట్లు పలువురు బిగ్ బాస్ రివ్యూవర్స్ చెబుతున్నారు. అవ్వకు అలా జరగడంతో తోటి కంటెస్టెంట్స్  తీవ్ర ఆందోళకు గురైనట్లు తెలుస్తోంది. ఆమెకు వైద్యం అందించేందుకు వైద్యులు కూడా హౌస్ లోకి వచ్చినట్లు సమాచారం. దీంతో గంగవ్వ అభిమానులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది ప్రాంక్ అని అంటున్నారు. 

gangavva 2

Also Read: BiggBoss ప్రియాంక సింగ్ ఇంట విషాదం.. తండ్రి చనిపోయారని ఎమోషనల్ పోస్ట్!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe