Bigg boss Promo: రచ్చ.. రచ్చ కొట్టుకుంటున్న కామనర్స్! దమ్ము శ్రీజ దెబ్బకు గుక్కపెట్టి ఏడ్చిన మనీష్

బిగ్ బాస్ సీజన్ 9 షో  కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ గా రసవత్తరంగా సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ప్రోమో చూస్తుంటే.. ఈరోజు ఎపిసోడ్ లో హౌజ్ ఫుల్ వేడెక్కనున్నట్లు తెలుస్తోంది.

New Update

Bigg boss Promo:  బిగ్ బాస్ సీజన్ 9 షో  కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్ గా రసవత్తరంగా సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ప్రోమో చూస్తుంటే.. ఈరోజు ఎపిసోడ్ లో హౌజ్ ఫుల్ వేడెక్కనున్నట్లు తెలుస్తోంది. డ్యూటీస్ విషయంలో కామనర్స్ వాళ్లలో వాళ్ళే కొట్టుకున్నారు. శ్రీజ- మర్యాద మనీష్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శ్రీజ మాటలకూ హార్ట్ అయిన మర్యాద ఏడ్చినట్లుగా ప్రోమోలో కనిపించింది. అంతేకాదు ''ఫస్ట్ కామనర్స్ కాదు వరస్ట్ కామనర్స్''  అంటూ కామనర్స్ అందరిపై అసహనం వ్యక్తం చేశాడు. తన టీమ్ మేట్స్ ఏ తనను టార్గెట్ చేశారన్నట్లుగా ఫీల్ అయ్యాడు మర్యాద మనీష్. మరోవైపు మాస్క్ మ్యాన్ కూడా ఇంకా తన అలక నుంచి బయటకు రాలేదు.

అలక ఇంకా తీరలేదు

వీకెండ్ ఎపిసోడ్ లో భరణి, ఇమ్యాన్యుయేల్ ని ఆడవాళ్ళూ అంటూ స్టేట్మెంట్ పాస్ చేయడాన్ని శ్రీజ, మిగతా హౌజ్ మేట్స్  తప్పు పట్టిన సంగతి తెలిసిందే. మాస్క్ మ్యాన్ తన ఉద్దేశమది కాదని చెప్పినప్పటికీ.. అతడి మాటలకు అర్థం అదేనని శ్రీజ వాదించింది. దీంతో మాస్క్ మ్యాన్ హౌజ్ మేట్స్ పై కోపంగా ఉన్నాడు. ఈ క్రమంలో లేటెస్ట్ ఎపిసోడ్  ప్రోమోలో శ్రీజ అతడి కోసం భోజనం తీసుకురాగా.. వద్దని చెప్పాడు. "ఉదయం నుంచి ఏం తినలేదు తినండి సర్" అని శ్రీజ బతిమాలాగా.. ఇంకో రెండు మూడు రోజులైనా నేను ఇలాగే ఉంటాను అంటూ మొండికేశాడు. మాస్క్ మ్యాన్ బిహేవియర్  ప్రేక్షకులకు కూడా కొంత చిరాకుగా కలిగించినట్లు తెలుస్తోంది. ఒక గేమ్ షోలో ఉన్నప్పుడు ఏదైనా స్పోర్టివ్ గా తీసుకోవాలి. అలా కాకుండా మాస్క్ మ్యాన్ తన తప్పును గ్రహించకుండా ఒకే విషయాన్ని పట్టుకొని వేలాడడం సరైనది కాదని ప్రేక్షకుల అభిప్రాయం. 

నామినేషన్స్ .. 

ఇక ఈ వారం నామినేషన్స్ విషయానికి వస్తే.. మర్యాద మనీష్, ప్రియా, మాస్క్ మ్యాన్,  పవన్, భరణి, ఫ్లోరా నామినేట్ అయ్యారు. ఈ వారం ముగ్గురు కామనర్స్ నామినేషన్స్ లో ఉండడం గమనర్హం. చూస్తుంటే ఈ వారం కామనర్స్ లో నుంచే ఒకరు ఎలిమినెట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రోమో ప్రకారం .. నామినేషన్ ప్రక్రియలో మనీష్ - రీతూ, తనూజ - మాస్క్ మ్యాన్ మధ్య గట్టిగానే వాగ్వదం జరిగినట్లు తెలుస్తోంది. 

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్

ఇదిలా ఉంటే మొదటి వారం లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ బిగ్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. కనీసం 5-6 వారలైన ఈమె హౌజ్ ఉంటుందని అందరూ భావించారు. కానీ, హౌజ్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. హౌజ్ ఆమె ఉందా? లేదా అన్నట్లుగా ఉంది. దీంతో మొదటి వారమే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. డీ షోలో కంటెస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శృష్టి.. ఆ తర్వాత సినిమా కొరియోగ్రాఫర్ గా ఎదిగింది. పుష్ప2 లో "సూసేకి అగ్గిరవ్వ " సాంగ్ కొరియోగ్రాఫీ చేసింది. 

Advertisment
తాజా కథనాలు