Bigg Boss 9 Promo: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను జోరుగా కొనసాగిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సారి డబుల్ హౌస్ కాన్సెప్ట్ తో సెలెబ్రెటీలతో పాటు కామనర్స్ కూడా అవకాశం కల్పించారు బిగ్ బాస్. కామనర్స్ ఎంపిక కోసం 'అగ్ని పరీక్ష' అనే పేరుతో ఓ ప్రీ షోను నిర్వహిస్తున్నారు. ఈ అగ్ని పరీక్షలో గెలిచిన వారు హౌజ్ లోకి వెళ్తారు.
'అగ్నిపరీక్ష' ప్రోమో
ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష' ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో కామన్ మెన్ క్యాటగిరీ నుంచి వచ్చిన 15 మంది కంటెస్టెంట్లు వారికి నచ్చిన వివిధ టాస్కుల్లో పాల్గొంటారు. వీరిలో కేవలం ముగ్గురు మాత్రమే హౌజ్ లోకి వెళ్తారు. మాజీ బిగ్ బాస్ విజేతలు అభిజిత్, నవదీప్, బిందు మాధవి ఈ షో జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఆ 15 మంది కామనర్స్ లో బిగ్ బాస్ లోకి వెళ్ళబోయేదెవరు అని డిసైడ్ చేసేది వీళ్ళే! అయితే ఈ 'అగ్నిపరీక్ష'లో 'గంగవ్వ' వయసులో ఉన్న ఒక పెద్దావిడ కూడా పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.
కామనర్స్ లిస్ట్:
అనుష రత్నం (ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్)
ప్రసన్న కుమార్ (ఒక్క కాలు లేని దివ్యాంగుడు)
దమ్ము శ్రీజ (ఇన్‌స్టాగ్రామ్ స్టార్)
మిస్ తెలంగాణ కల్కి
డాలియా (జిమ్ కోచ్)
దివ్య నిఖిత (వెజ్ ఫ్రైడ్ మోమో ఫేమ్)
శ్రియ (చిన్న వయస్సు కంటెస్టెంట్)
శ్వేతా శెట్టి (యూకే నుంచి వచ్చిన బాడీబిల్డర్)
పవన్ కళ్యాణ్ (ఆర్మీ వ్యక్తి)
లాయర్ ప్రశాంత్
షాకిబ్ (సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్)
డెమోన్ పవన్ (ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్)
ప్రియా శెట్టి
మర్యాద మనీష్ (వ్యాపారవేత్త)
మాస్క్డ్ మ్యాన్ హృదయ్
మొత్తానికి సీజన్ 9.. సెలబ్రిటీస్ వెర్సెస్ కామనర్స్ రసవత్తరంగ సాగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ లో మరో ట్విస్ట్ కూడా ఉండబోతున్నట్లు ఇటీవలే విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతోంది.నాగార్జున.. ఈసారి బిగ్ బాస్ ని కూడా మార్చేశాం అని చెప్పడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగించింది.
ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
సెలబ్రిటీ కంటెస్టెంట్స్
రీతూ చౌదరి
దీపిక (టీవీ నటి)
సీతకంఠ్
హారిక
నవ్య స్వామి (టీవీ నటి)
జ్యోతి రాయ్ (టీవీ నటి)
ముఖేష్ గౌడ (టీవీ నటుడు)
తేజస్విని గౌడ (టీవీ నటి)
కల్పిక గణేష్ (నటి)
అలేఖ్య చిట్టి
ఇమ్మాన్యుయేల్ (జబర్దస్త్ కమెడియన్)
సాయి కిరణ్ (టీవీ నటుడు)
శ్రావణి వర్మ (సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్)
ఆర్జే రాజ్
దేబ్జానీ ( టీవీ నటి)
Also Read: Ananya Nagalla: వైట్ శారీలో తెలంగాణ బ్యూటీ అందాల ఆరబోత.. ఫొటోలు చూస్తే ఫిదా !