/rtv/media/media_files/2025/10/20/bigg-boss-9-2025-10-20-18-31-04.jpg)
bigg boss 9
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. ఏడవ వారంలో అడుగుపెట్టింది. ఆరవ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఇంట్లోకి అడుగుపెట్టిన భరణి ఎలిమినేటై అందరికీ షాకిచ్చాడు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో రాము రాథోడ్, భరణి మధ్య చివరి ఎలిమినేషన్ రౌండ్ జరగగా.. లీస్ట్ ఓటింగ్ తో భరణి ఎలిమినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మండే నామినేషన్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ సాయి శ్రీనివాస్, తనూజ, రాము రాథోడ్, రీతూ ఫుల్ ఫైర్ మీద కనిపించారు. ఎప్పుడూ లేని విధంగా రాము రాథోడ్ ఈసారి నామినేషన్స్ లో రెచ్చిపోయాడు.
రీతూ పై రెచ్చిపోయిన రాము రాథోడ్..
నామినేషన్ ప్రక్రియలో రీతూ తన నామినేషన్ పవర్ ఉపయోగించి రాము రాథోడ్ ని నామినేట్ చేసింది. ''అసలు నువ్వు ఆటలో కనిపించడం లేదు'' అంటూ రామును నామినేట్ చేసింది రీతూ. దీంతో రాము.. అయితే కళ్ళు చెక్ చేయించుకో రీతూ అంటూ రెచ్చిపోయాడు! ఇక రీతూ కూడా ఏ మాత్రం తగ్గలేదు. నాకు ఎవరూ లేరు, నేను ఒక్కడినేనని సింపతీ గేమ్ ఆడుతున్నావు అంటూ రాముతో వాదించింది. దానికి రాము.. నేను అలా ఎప్పుడు అన్నానో ప్రూఫ్ చూయించు.. ప్రూఫ్ చూయించు అని ఇద్దరూ గట్టి గట్టిగా అరుచుకున్నారు.
పచ్చళ్ళ పాపకు తనూజ కౌంటర్
ఆ తర్వాత తనూజ, పికిల్స్ పాప రమ్య మోక్ష మధ్య కూడా హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. నువ్వు డ్రామా క్వీన్, నటిస్తున్నావు, ఫేక్ అంటూ తనూజాను నామినేట్ చేసింది రమ్య మోక్ష. దీంతో తనూజ పచ్చళ్ళ పాప దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. డ్రామా క్వీన్ అనుకుంటావో .. సూపర్ క్వీన్ అనుకుంటావో నీ ఇష్టం.. నేనింతే.. ఇదే నా అట అంటూ గట్టిగా బదులిచ్చింది.