/rtv/media/media_files/2025/10/31/bigg-boss-9-telugu-2025-10-31-15-55-46.jpg)
bigg boss 9 telugu
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 రాను రానూ మరీ బోరింగ్ గా మారుతోంది. ఒకసారి హాజ్ ఎలిమినేటైన కంటెస్టెంట్లు మళ్ళీ లోపలి రావడం.. వాళ్ళు హౌజ్ లో ఉన్నవారిని నామినేట్ చేయడం, మరో పక్క రీ ఎంట్రీలు అంటూ ఇద్దరు లోపలికి రావడం ఇలా అంతా గందరగోళంగా ఉంది బిగ్ బాస్. ఈ క్రమంలో తాజాగా మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అన్నట్లుగా కథ అడ్డం తిరిగింది. శ్రీజ దమ్ముకు మరోసారి అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఒకసారి శ్రీజను అన్యాయంగా హౌజ్ నుంచి ఎలిమినేట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటింగ్ ఆధారంగా కాకుండా ఇష్టానుసారంగా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తే ఓట్లేసే జనాలు పిచ్చోళ్లా అంటూ బిగ్ బాస్ పై మండిపడ్డారు నెటిజన్లు. దీంతో బిగ్ బాస్ టీమ్ శ్రీజకు మరోసారి రీఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ ప్రేక్షకులందరికీ ప్రశ్నగా మారిన మరో విషయమేంటంటే.. అన్యాయంగా ఎలిమినేటైన శ్రీజతో పాటు ఓట్లు తక్కువగా వచ్చి బయటకు వెళ్లిన భరణికి కూడా రీ ఎంట్రీ అవకాశం కల్పించారు. ఓటింగ్ తక్కువగా వచ్చి ఎలిమినేటైన ఏడుగురు కంటెస్టెంట్స్ లో భరణికే మాత్రమే ఆ బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చారనే దానికి బిగ్ బాస్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా, వీరిద్దరిలో ఒకరికి మాత్రమే రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపాడు బిగ్ బాస్. దీని కోసం బిగ్ బాస్ ఇద్దరి మధ్య ఓటింగ్ నిర్వహించారు. బయట శ్రీజకు వస్తున్న సపోర్ట్, బజ్ చూసి వన్‌సైడ్ ఫైట్ అవుతుందని, ఖచ్చితంగా శ్రీజకే ఎక్కువ ఓట్లు వస్తాయని, మళ్ళీ శ్రీజనే రీ- ఎంట్రీ ఇస్తుందని అనుకున్నారు.
శ్రీజకు మళ్ళీ అన్యాయం
కానీ, బిగ్ బాస్ వేసిన వ్యూహంలో ఫలితం అంచనాలకు పూర్తి భిన్నంగా వచ్చింది. శ్రీజకు కాకుండా భరణికి ఓటింగ్ ఎక్కువగా పడింది..చివరికి భరణినే పర్మనెంట్ హౌజ్ మేట్ అయినట్లు తెలుస్తోంది. ఈరోజు ఎపిసోడ్ లో భరణిని పర్మనెంట్ హౌజ్ మేట్ అనౌన్స్ చేయనున్నారట బిగ్ బాస్. అయితే ఇప్పుడు భరణికి పర్మినెంట్ హౌస్‌మేట్‌గా అవకాశం ఇవ్వడం మరోసారి వివాదానికి కారణమవుతోంది. అన్యాయంగా హౌజ్ నుంచి పంపిన శ్రీజకు కాకుండా భరణికి ఎందుకు రీఎంట్రీ అవకాశం ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారు శ్రీజ అభిమానులు. శ్రీజకు మళ్ళీ అన్యాయం చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Baahubali The Epic Review: 'బాహుబలి ది ఎపిక్' ఊచకోత.. థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ!
Follow Us