Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున గత వారం హౌజ్ మేట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడి ఒక్కొక్కరికి గట్టిగా క్లాస్ ఇచ్చారు. డెమోన్ పవన్ కి ఏకంగా రెడ్ కార్డు ఇచ్చారు. నామినేషన్ ఎపిసోడ్ తర్వాత డెమోన్- రీతూకి జరిగిన గొడవలో.. డెమోన్ రీతూతో ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. ఒక అమ్మాయిని అలా నెట్టేయడం సరైనదేనా అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తనను బిగ్ బాస్ ఏ మాత్రం సహించరు అంటూ డెమోన్ కి రెడ్ కార్డు ఇచ్చారు బిగ్ బాస్. వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని తెలిపారు. దీంతో డెమోన్, మిగతా అంతా ఒక్కసారిగా షాకయ్యారు! పవన్ సారీ చెప్పినప్పటికీ నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు. వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకొని బయటకు వచ్చేయని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రీతూ కూడా డెమోన్ ని పంపించకండీ అంటూ నాగార్జునను బతిమాలడం ప్రోమోలో కనిపించింది. మరి కేవలం ప్రోమో కట్ కోసం ఇందంతా చేశారా? లేదా పవన్ కి నిజంగానే రెడ్ కార్డు ఇచ్చేసి హౌజ్ నుంచి ఎలిమినేట్ చేశారా? అనేది నైట్ ఎపిసోడ్ లో చూడాలి.
Also Read: Bigg Boss 9: దివ్వెల మాధురి- భరణి రచ్చ రచ్చ .. బిగ్ బాస్ ఇంట్లో బిర్యానీ తెచ్చిన పెంట !
Follow Us