Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ప్రోమో .. నిఖిల్, ప్రేరణ మధ్య గొడవ..!

బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. నిన్నటి నామినేషన్ ప్రక్రియకు కొనసాగింపుగా ఈ ప్రోమోను విడుదల చేశారు. ఈరోజు నామినేషన్ ప్రోమోలో సీరియల్ బ్యాచ్ నిఖిల్, ప్రేరణ మధ్య ఆర్గుమెంట్ జరగడం చూపించారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

bigg boss 8
New Update

బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇప్పటికే సోనియా, సీత, శేఖర్ భాష, విష్ణు ప్రియా వారి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయగా... తాజాగా బిగ్ బాస్ ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశాడు. ఇందులో మిగిలిన కంటెస్టెంట్స్ నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, నైనికా, యష్మీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం చూపించారు.

పృథ్వీ VS మణికంఠ

ఈరోజు నామినేషన్ ప్రోమోలో పృథ్వీ మణికంఠను నామినేట్ చేశాడు. 'క్లాన్ ' విషయంలో నిన్ను సెలెక్ట్ చేసుకున్న నిఖిల్ ను కాదని నైనికా టీమ్ లోకి వెళ్ళాలి అనుకోవడం బ్యాక్ స్టాబింగ్ లా అనిపించింది. అది తనకు నచ్చలేదని పృథ్వీ మణికంఠను నామినేట్ చేశాడు. దీంతో మణికంఠ ఈ గేమ్ అనేదే సర్వైవల్ కోసం.. కావున దానికి అనుగుణంగా మన డెసిషన్స్ ఉంటాయి.. అదే నేను చేశానని వాదించాడు. వీరిద్దరి మధ్య ఆర్గుమెంట్ గట్టిగానే జరిగినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

ప్రేరణ VS నిఖిల్

ప్రేరణ ఇంట్లో ఫుడ్ విషయానికి సంబంధించి నిఖిల్ ని నామినేట్ చేసింది. ఈ విషయంలో వీరిద్దరి మధ్య ఆర్గుమెంట్ జరిగినట్లుగా ప్రోమోలో చూపించారు. ఆ తర్వాత సీత, ప్రేరణ మధ్య మళ్ళీ  'డస్ట్ బిన్ ' పంచాయితీ మొదలవుతుంది. తాను చేసింది తప్పు కాదని ప్రేరణ వాదించగా.. సీత మాత్రం 100 మంది కకరెక్ట్ అని చెప్పిన నాకు తప్పు అనిపిస్తే తప్పేనని అంటూ ప్రేరణతో గట్టిగా వాదించింది. ఇక ప్రోమో చివరిలో నైనిక కూడా  నిఖిల్ ను నామినేట్ చేయడం కనిపించింది.  'క్లాన్'  లీడర్ గా నువ్వు ఫెయిల్ అయ్యావని నిఖిల్ ను నామినేట్ చేశాడు నబీల్. దానికి నిఖిల్ ఇక్కడ నేనేమీ డిక్టేటర్ ను కాదు అంటూ నబీల్ కు కౌంటర్ ఇచ్చాడు. మరి నిఖిల్ ఎవరిని నామినేట్ చేశాడో తెలియాలంటే నైట్ ఎపిసోడ్ చూడాల్సిందే. 

Also Read: NTR Devara: రిలీజ్‌కు ముందే 'దేవర' సంచలన రికార్డు! ఆ లిస్ట్‌లో చేరిన తొలి ఇండియా సినిమా.. - Rtvlive.com

#bigg-boss-telugu-8-promo
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe