/rtv/media/media_files/2025/10/18/bharani-2025-10-18-16-58-09.jpg)
Bharani
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ భారీ ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ హౌజ్ నుంచి బయటకు వెళ్తున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం నామినేషన్స్ భరణి, తనూజ, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, డెమోన్ పవన్, రాము రాథోడ్ ఉండగా.. ఓటింగ్ పోటాపోటీగా జరిగింది. వీరందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఓ షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పక్కా టాప్ 5 కంటెస్టెంట్ అని భావించిన భరణి శంకర్ ఎలిమినేట్ అయినట్లు నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. రాము రాథోడ్, భరణి మధ్య చివరి ఎలిమినేషన్ రౌండ్ జరగగా.. భరణి ఎలిమినేటై అందరికీ షాకిచ్చినట్లు తెలుస్తోంది.
ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్రా..
బిగ్ బాస్ లీక్స్ ప్రకారం.. భరణి, రాము రాథోడ్ డేంజర్ జోన్ లో ఉండగా వీరిద్దరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇమ్మాన్యుయేల్ కి కల్పించారట బిగ్ బాస్. ఇమ్మాన్యుయేల్ తో ఉన్న పవర్ అస్త్రా ఉపయోగించి ఇద్దరిలో ఒకరిని సేవ్ చేయొచ్చని చెప్పారట. కానీ, ఇమ్మాన్యుయేల్ భరణి సేవ్ అవుతాడని భావించి పవర్ అస్త్రా ఉపయోగించడానికి ఒప్పుకోలేదట. దీంతో ఓటింగ్ లో అందరికంటే లీస్ట్ లో ఉన్న భరణి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
భరణి ఎలిమినేషన్ కి కారణాలు..
మొదటి రెండు వారాలు తన మాటతీరు, ఆటతీరుతో అదరగొట్టిన భరణి.. ఆ తర్వాత ఆట పక్కన పెట్టేసి బంధాలలో చిక్కుకుపోయారు. కూతురు, చెల్లి, తమ్ముడూ అంటూ అందరితో బంధం క్రియేట్ అవడంతో.. ఆటలో తన పాయింట్స్ గట్టిగా చెప్పలేకపోయారు అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగింది. దీనికి తోడు గత వారం శ్రీజ, కళ్యాణ్ విషయంలో భరణి ఆడిన తీరు చాలా మందికి నచ్చలేదు. ముందు తనే కళ్యాణ్ దగ్గరికి వెళ్లి తనూజాతో పెయిర్ అప్ అవ్వమని చెప్పి.. ఆ తర్వాత మళ్ళీ తనూజాతో.. కళ్యాణ్ నీతో పెయిర్ అవ్వడం వెనుక అతడి స్వార్థం ఉంది! నువ్వు మోసపోయావు అంటూ చెప్పడం అతడి డబుల్ స్టాండ్స్ ని బయటపెట్టింది.
మరోవైపు దివ్య హౌజ్ లోకి వచ్చిన తర్వాత భరణి ఆట పూర్తిగా గాడి తప్పిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆమె వచ్చి రాగానే భరణిని నెంబర్ వన్ పొజిషన్ లో పెట్టడంతో.. కాస్త రిలాక్స్ అయ్యారు భరణి. తానొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే భావనలో ఉండిపోయారు. ఇవ్వనీ కూడా భరణి ఎలిమినేషన్ ప్రధాన కారణాలని తెలుస్తోంది.
Also Read: K-RAMP: మళ్ళీ అదే రిపీట్ అయ్యింది.. కే- ర్యాంప్ పై కిరణ్ అబ్బవరం ఎమోషనల్ వీడియో!