బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ కెరీర్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తక్కువ సినిమాల్లోనే చాలా వరకు పెద్ద హిట్లుగా నిలిచాయి.
'దమ్ లగా కే హైషా' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో భూమి ఉత్తమ నటనకు బెస్ట్ డెబ్యూ గా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు వరించింది.
ఈ ఏడాది 'భక్షక్', 'ఖేల్ ఖేల్ మే' చిత్రాలలో మెరిసింది భూమి. సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
తరచూ నెట్టింట ఎత్నిక్, వెస్ట్రన్, మినీ డ్రెస్, కటౌట్ డ్రెస్, మినీ డ్రెస్ ఇలా అన్ని రకాల డ్రెస్సులతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా భూమి సాంప్రదాయ నీలి రంగు చీరకు మోడ్రన్ టచ్ జోడించి నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది.
ప్రత్యేకమైన శైలిలో చీరను ధరించిన ఫోటోలను భూమి న్స్టాగ్రామ్లో పంచుకుంది. ఈ చీరను స్టైలిస్ట్ మనీషా మెల్వానీ డిజైన్ చేశారు. నీలిరంగు చీరలో భూమి చేతికి ఉన్న వెండి బ్రాస్లెట్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
సోంచిరియా , సాంద్ కి ఆంఖ్, బాలా, పతి పత్నీ ఔర్ వంటి చిత్రాలతో భూమి నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. హిందీ సినిమాలతో పాపులరైన ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్రలో పుట్టి పెరిగింది.
Image Credits: Bhumi Pednekar/ Instagram