Bhagyashree Borse: దుల్కర్ సల్మాన్ నటించిన కాంత సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ నటి భాగ్యశ్రీ బోర్సే, ఇప్పుడు తన తదుపరి చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka)తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ సినిమా 2025 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజాగా చిత్ర ప్రచారంలో భాగంగా భాగ్యశ్రీ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో ఆమె మహాలక్ష్మి అనే కాలేజీ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. “ఈ సినిమాలో నా పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుంది. ప్రేక్షకులు ఈ పాత్రను చాలా రోజుల వరకు గుర్తుంచుకుంటారు" అని ఆమె చెప్పింది.
భాగ్యశ్రీ మాట్లాడుతూ, దర్శకుడు మహేశ్ బాబు పి కథ చెప్పగానే తాను వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణంలోకి వచ్చిన తరువాత ఇక్కడి ప్రేక్షకులు తమ హీరోలను ఎంతగా ప్రేమిస్తారో చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. “వ్యక్తిగత పరిచయం లేకపోయినా, ఇంతగా ప్రేమించడం చాలా పవిత్రమైన భావన” అని ఆమె చెప్పారు.
హృదయాన్ని తాకే ప్రేమ కథ..
ఈ సందర్భంగా సినిమా ప్రేమ కథ గురించి మాట్లాడిన భాగ్యశ్రీ, ఆంధ్ర కింగ్ తాలూకాలో ప్రేమ కథ చాలా స్వచ్ఛమైనది, మనసును హత్తుకునేదని అన్నారు. “నువ్వుంటే చాలు, చిన్నిగుండెలో వంటి పాటల్లో ఉండే లోతైన ప్రేమ భావం ఈ సినిమాలో కూడా ఉంటుంది. ఆ భావాన్ని ప్రేక్షకులు స్పష్టంగా ఫీల్ అవుతారు” అని ఆమె పేర్కొన్నారు.
నటుడు రామ్ తో పని చేసిన అనుభవం గురించి కూడా ఆమె వివరించారు. “రామ్ చాలా ఎనర్జిటిక్ నటుడు. ఆయనతో స్క్రీన్‌పై నటించడం నాకు మంచి అనుభవం. ఆయన ఎనర్జీకి నేను కూడా సరిగ్గా సెట్ అయ్యానని అనుకుంటున్నాను. మా మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, డైలాగులు చాలా అందంగా రాసారు” అని భాగ్యశ్రీ తెలిపారు.
ఇక కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 2000 దశక ప్రారంభ కాలం నేపథ్యంలో రూపొందిన ఈ గ్రామీణ ప్రేమ కథను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. సినిమాలో సంగీతం వివేక్- మెర్విన్ అందించారు. మొత్తానికి, ప్రేమ, ఎమోషన్స్, గ్రామీణ వాతావరణం కలిసిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bhagyashree Borse: 'ఆంధ్ర కింగ్ తాలూకా'పై భాగ్యశ్రీ బోర్సే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
భాగ్యశ్రీ బోర్సే రామ్ పోతినేని హీరోగా నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో మహాలక్ష్మి పాత్రలో కనిపిస్తున్నారు. సినిమాలోని ప్రేమ కథ హృదయాన్ని తాకేలా ఉందని ఆమె చెప్పింది. రామ్‌తో పని చేయడం మంచి అనుభవమని తెలిపారు. ఈ చిత్రం నవంబర్ 27, 2025న విడుదల కానుంది.
Bhagyashree Borse