Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి సాడ్ న్యూస్ .. 'అఖండ 2' మళ్ళీ వాయిదా!

బాలయ్య ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న   'అఖండ 2' మరోసారి వాయిదా పడింది. తాజాగా సినిమా నిర్మాణ సంస్థ ‘14 రీల్స్‌ ప్లస్‌’ ఈ విషయాన్ని ప్రకటించింది.

New Update

Akhanda 2: బాలయ్య అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇప్పటికే పలు కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న 'అఖండ2'  మళ్ళీ వాయిదా పడింది. తాజాగా సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ తేదీకి సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదని తెలిపింది. రీ రికార్డింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందని..  అందుకే  సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది.  అఖండ 2, పవన్ ఓజీ రెండూ దసరా బరిలో ఉండడంతో బాక్సాఫీస్ పోటీ గట్టిగా ఉండబోతుందని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా బాలయ్య అఖండ 2 రేస్ నుంచి తప్పుకుంది. 

డైరెక్టర్ బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న అఖండ2 పై  ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం పార్ట్ 2 పై అంచనాలను పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే  కొన్ని వీఎఫెక్స్ పై విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా టీజర్ లో బాలయ్య త్రిశూలం సీన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనిపై మీమ్స్ కూడా వచ్చాయి.  దీంతో సినిమా వీఎఫెక్స్ పై  అత్యంత శ్రద్ధ వహిస్తున్నారు మేకర్స్.   బోయపాటి- బాలయ్య కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా అఖండ 2. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు అఖండ 2 విషయంలో కూడా బోయపాటి పవర్ ఫుల్ స్క్రీన్ ప్లేతో సిద్ధమయ్యారని తెలుస్తోంది. 

తమన్ మ్యూజిక్.. 

అఖండ 2 లో తమన్ మ్యూజిక్ మరో హైలైట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. బాలయ్య సినిమా అనగానే తమన్ కి పూనకం వచ్చినట్టు మ్యూజిక్ కొడతాడు. రీ సౌండ్లతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కి తమన్ అందించిన  బీజీఎం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించగా..  ఈసారి అంతకు మించిన  పాటలు, నేపథ్య సంగీతం ఉండనుంది.  ఇదిలా ఉంటే  సల్మాన్ ఖాన్ 'బజరంగ్ భాయీజాన్'  సినిమాలో మున్ని పాత్రతో ఆకట్టుకున్న  చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా అఖండ 2 లో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇందులో హర్షాలీ పాత్ర పేరు జనని. కథలో ఆమె ప్రాముఖ్యత బలంగా ఉండబోతుందని తెలుస్తోంది. 

Also Read: బాలయ్య 'అఖండ' లో బజరంగీ భాయిజాన్ చైల్డ్ ఆర్టిస్ట్! ఇప్పుడు ఎంత అందంగా ఉందో

Advertisment
తాజా కథనాలు