Athadu Re-Release: మహేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్.. కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు సూపర్ హిట్స్ గా నిలిచిన స్టార్ హీరోల సినిమాలను మరోసారి తెరపై చూసేందుకు ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఇలా ఇప్పటికే విడుదలైన చాలా సినిమాలు రీ రిలీజ్ లో కూడా రికార్డు స్థాయి నంబర్స్ రాబట్టాయి. ఇప్పుడు మహేష్ బాబు 'అతడు' సినిమా రీ రిలీజ్ అవుతుండగా భారీ స్పందన వస్తోంది. ఆగస్టు 9న మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సినిమా రిలీజ్ ఇంకా ఐదు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా మరోసాయారి 70mm స్క్రీన్ పై చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే హైదరాబాద్ లోని సుదర్శన్ 35mm, దేవి 70mm వంటి ప్రధాన థియేటర్స్ లో ఆగస్టు 9కి షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా ఓవర్ సీస్ లో అతడు అడ్వాన్స్ బుకింగ్స్ కొత్త సినిమాల కంటే ఎక్కువగా ఉండడం.. 'అతడు' క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.
నైజాంలో ఈ సినిమా రీరిలీజ్ హక్కులను ఏషియన్ సినిమాస్ కొనుగోలు చేయగా.. ఏపీలో ఏరియాల వారిగా పోటీపడి మరీ అతడు రీరిలీజ్ హక్కులు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా రీరిలీజ్ హక్కులు రూ. 3కోట్లకు పైగా పలికినట్లు సమాచారం. ఒక రీరిలీజ్ సినిమా ఈ రేంజ్ లో ప్రీరిలీజ్ బిజినెస్ చేయడం రికార్డ్ అనే చెప్పాలి. గతంలో రీరిలీజైన మహేష్ బాబు సినిమాలు ఒక్కడు, మురారి, ఖలేజా కంటే రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.