Arundhati: 16 ఏళ్ళ తర్వాత 'అరుంధతి' రీమేక్ .. కొత్త హీరోయిన్ ఎవరో తెలిస్తే షాకే !

అరుంధతి.. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.  హారర్ కథాంశంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

New Update
Arundhati remake

Arundhati remake

Arundhati Remake:  అరుంధతి.. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.  హారర్ కథాంశంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో  'జేజమ్మ'  గా అనుష్క నటన, అనే రాజసానికి అందరూ ఫిదా అయిపోయారు. అప్పటివరకు గ్లామర్  పాత్రలకే పరిమితమైన అనుష్కకు  'అరుంధతి ' 'లేడీ సూపర్ స్టార్' ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.  సినిమాలోని ఒక్కో ఒక్కో విజువల్, సోనూసూద్ పోషించిన భయంకరమైన పశుపతి పాత్ర, అనుష్క నట విశ్వరూపం ఇప్పటికీ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అనుష్క కెరీర్ అండ్ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది 'అరుంధతి'. 

16 ఏళ్ళ తర్వాత రీమేక్ 

అయితే  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. విడుదలైన 16 ఏళ్ళ తర్వాత ఈ ఐకానిక్ చిత్రాన్ని హిందీలో  రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నారట మేకర్స్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్  దీనిని రీమేక్ చేసే ప్లాన్ చేస్తున్నారని చర్చ నడుస్తోంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ కి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. 

ఇది మాత్రమే కాదు.. మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. ఈ భారీ ప్రాజెక్టులో  పవర్ ఫుల్ 'జేజమ్మ' పాత్రను పోషించే అవకాశం యంగ్ సెన్సేషన్ శ్రీలీలకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.  ఇక సోనూసూద్ పాత్రలో అతడే నటిస్తారని టాక్. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: Abhishek Bachchan: అభిషేక్ అవార్డులు కొనుక్కుంటారు.. ట్రోలర్స్ కి హీరో స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
తాజా కథనాలు