Ari Movie: సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి.. అదరగొడుతున్న 'అరి'

సీనియర్ యాక్టర్ సాయి కుమార్, యాంకర్ అనసూయ, వైవా హర్ష, వినోద్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'అరి' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది.

New Update
ari movie

ari movie

Ari Movie: సీనియర్ యాక్టర్ సాయి కుమార్, యాంకర్ అనసూయ, వైవా హర్ష, వినోద్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'అరి' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా.. కేవలం మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది ఈ చిత్రం. గత వారం విడుదలైన 'అరి' సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి అడుగుపెట్టింది. దీపావళి సందర్భంగా ఈ వారం వచ్చిన  మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్ చిత్రాలకు పోటీగా కొనసాగుతోంది. కొత్త చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. పదో రోజు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు జయ శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. పదో రోజు థియేటర్లో జనాలు సినిమా వీక్షిస్తున్నట్టు ఎక్స్ లో ఫొటోలు పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

అరిషడ్వర్గాలు కథతో 

అరిషడ్వర్గాలు (కామం, క్రోధం, లాభం, మొహం, మదం, మాత్సర్యం ) అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విడుదలైన మొదటి రోజు నుంచే సోషల్ మీడియా, సినీ విశ్లేషకుల నుంచి పాజిటివ్ స్పందనలను సొంతం చేసుకుంది. అందుకే రెండో వారం కూడా ఈ చిత్రాన్ని కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. మరి రెండో వారం కొత్త చిత్రాలతో ఎంత వరకు పోటీ పడుతుందో చూడాలి.   'పేపర్ బాయ్'  లాంటి మంచి లవ్ స్టోరీతో ఆకట్టుకున్న దర్శకుడు జయ శంకర్.. ఇప్పుడు 'అరి' అనే ఓ కొత్త కాన్సెప్ట్ తో మరోసారి హిట్టు కొట్టారు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని  'అరిషడ్వర్గాలు' అనే కాన్సెప్ట్ తీసుకొని ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే  కృష్ణ తత్వం, ఆధ్యాత్మిక సందేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

Also Read: CINEMA: ఆ కోరిక ఆపుకోలేకపోయా.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు