A.R.Rahaman Couple Divorce:
సినిమా వాళ్ళ వివాహ బంధాలు నాజూకుగానే ఉంటాయి. అందరూ విడిపోతారని కాదు కానీ...చాలా మంది విడపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పెళ్ళయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటుంటే...మరి కొంత మంది చాలా ఏళ్ళు గడిచాక విడిపోతున్నారు. తాజాగా వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత అయిన ఏ ఆర్ రహమాన్ దంపతులు సెపరేట్ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య సైరా స్వయంగా ప్రకటించారు. ఇప్పటికీ ఇద్దరి మధ్యనా గాఢమైన ప్రేమ ఉందని...కానీ ఇబ్బందికర పరిస్థితులు కూడ ఉన్నాయని ఆమె చెప్పారు. ఎంత ప్రేమ ఉన్నా...ఇద్దరం కలిసి ఉండలేకపోతే..విడిపోవడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నామని సైరా తెలిపారు. ఇది చాలా ఆవేదనతో కూడుకున్న నిర్ణయమని సైరా అన్నారు. తన జీవితంలో అత్యంత కష్టమైన అధ్యాయం ఇది అని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు, ఫ్యాన్స్ తమను సహకరించాలని సైరా అభ్యర్ధించారు.
Also Read: UN: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..200 మంది చిన్నారుల మృతి.
Also Read: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్