BIG BREAKING: పవన్ కల్యాణ్ కు తీవ్ర అనారోగ్యం.. హైదరాబాద్ కు తరలింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. హై ఫీవర్, జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయన మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.

New Update
pawan Kalyan

pawan Kalyan

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నాలుగు రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. హై ఫీవర్, జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయన మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. అయితే నాలుగు రోజులైనా జ్వరం ఇంకా తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పవన్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.  ఇవాళ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

దీంతో పవన్ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ అన్న త్వరగా కోలుకోవాలి అంటూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే పవన్  'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు వర్షంలో తడిశారు. దీని కారణంగానే జలుబు, దగ్గుతో ఆయన వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తోంది. జ్వరం ఉన్నప్పటికీ, పవన్ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైనట్లు తెలిసింది. ఆ తర్వాత జ్వరం పెరగడంతో, కొన్ని శాఖాపరమైన గురించి టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఓజీ తో బ్లాక్ బస్టర్ 

ఇదిలా ఉంటే.. నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన ఓజీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 12 ఏళ్లకు పవన్ కు సరైన హిట్ పడిందని  ప్రేక్షకులు భావిస్తున్నారు. డైరెక్టర్ సుజీత్ ఫ్యాన్స్ కు కావాల్సిన విధంగా పవన్ చూపించారని అంటున్నారు. సినిమాలో పవన్ స్టైల్, స్వాగ్, మాస్ అప్పీల్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిచాయని చెబుతున్నారు. 'అత్తారింటికి దారేది' తర్వాత మళ్ళీ 'ఓజీ' పవర్ స్టార్ కు ఆ రేంజ్ హిట్ పడిందని సంబరాలు చేసుకుంటున్నారు. కథ రొటీన్ అయినప్పటికీ సుజీత్ మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని తెలుస్తోంది.

సుజీత్ ప్రతి సినిమాలో కూడా అతడి స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్ ప్లే కథకు కొత్తదనాన్ని జోడిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా సుజీత్ మేకింగ్ స్టైల్ కి ఫిదా అయినవారే. 

బిగ్గెస్ట్ ఓపెనింగ్స్... 

విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోల ద్వారా రికార్డ్ వసూల్లు సాధించిన 'ఓజీ' విడుదల తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ మంచి ఆరంభాన్ని మొదలు పెట్టింది. డే 1  ప్రపంచావ్యాప్తంగా రూ. 70 కోట్లు వసూలు చేయగా.. ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 20 కోట్లు వసూలు చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.  దీంతో తొలిరోజు రూ. 90 కోట్లతో భారీ ఓపెనింగ్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇవి పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అని తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు