Ghaati OTT: అమెజాన్ ప్రైమ్‌లో ఘాటు ఎంట్రీ ఇచ్చిన ‘ఘాటి’.. అనుష్క విశ్వరూపం అంతే!

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న 'ఘాటి' సినిమాలో అనుష్క నటన మాత్రమే మెప్పించగా, సినిమా కథ, స్క్రీన్‌ప్లే మాత్రం ఎక్కువ మందిని ఆకట్టుకోలేకపోయాయి. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి మిక్స్డ్ టాక్ దక్కించుకుంది.

New Update
Ghati OTT

Ghaati OTT

Ghaati OTT: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అనుష్క శెట్టి(Anushka Shetty) నటించిన లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా సినిమాకు విడుదల ముందు మంచి బజ్ ఉన్నా, విడుదలైన తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

అనుష్క పర్ఫార్మెన్స్... 

ఈ సినిమాలో అనుష్క తన నటనతో స్క్రీన్‌ని ఆకట్టుకుంది. ఆమె ఎమోషనల్ సీన్స్‌లో చూపించిన ఇంటెన్సిటీ, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ నెటిజన్లను ఆకర్షించాయి. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి "సలార్", "కేజీఎఫ్" స్థాయిలో ఉందని కూడా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఒక పూజా సీన్ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని ట్వీట్స్ చేస్తూ మెచ్చుకుంటున్నారు.

సినిమాకి మిక్స్డ్ టాక్..

అయితే అనుష్క నటన తప్ప సినిమాపై పెద్దగా నెగెటివ్ కామెంట్స్‌నే వినిపిస్తున్నాయి. చాలా మంది ప్రేక్షకులు సినిమా పేసింగ్ బాగోలేదని, ఇంటర్వెల్ వరకూ బోరింగ్‌గా ఉందని చెబుతున్నారు. కథలో కొత్తదనం లేదని, కొన్ని యాక్షన్ సీన్స్ అతిగా ఉందని అంటున్నారు. కొన్ని సీన్లు రిపిటేటివ్‌గా అనిపించాయని విమర్శిస్తున్నారు.

అలాగే, అనుష్కకు ఇలాంటి పాత్ర సరిపోలలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పాటలు మాత్రం ఓకే అని, కొన్ని విజువల్స్ ఆకట్టుకున్నాయని చెప్పుకుంటున్నారు. కానీ మొత్తంగా సినిమా ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోయింది అన్నదే ఫీడ్‌బ్యాక్.

బజ్ ఉంది కానీ.. 

సినిమా విడుదలకు ముందు మంచి అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా కథ పరంగా ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. బలమైన నటన ఉన్నా, స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ కంటెంట్ లోపించిందన్నది ప్రేక్షకుల అభిప్రాయం. ఈ కారణంగా సినిమా డిజిటల్ రీతిలో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయినట్టు కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు