Paradha Trailer: 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'పరదా'. ఈ చిత్రం ఆగస్టు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా 'పరదా' ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆ గ్రామంలోని కఠినమైన సంప్రదాయాలు, కట్టుబాట్ల వల్ల మహిళలు ఎదుర్కొనే కష్టాలు, వాటిని ఎదుర్కోవడానికి హీరోయిన్ చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ.
పరదా ట్రైలర్
ఇందులో అనుపమ 'సుబ్బు' అనే పాత్రలో నటించగా.. దర్శన్ రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత మరో కీలక పాత్రలను పోషించారు. విభిన్న దారులకు చెందిన ఈ ముగ్గురు మహిళల ప్రయాణంలో ఎదురయ్యే మలుపులు, సవాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ సుబ్బు తన మొహాన్ని ఎప్పుడు పరదాతో ఎందుకు కప్పి ఉంచుతుంది? ఆమె అలా చేయడం వెనుక ఉన్న రహస్యమేంటి అనేది సినిమాలో ఆసక్తికరమైన అంశం.
కేవలం సంప్రదాయాల గురించి మాత్రమే కాకుండా ట్రైలర్ మధ్యలో కొన్ని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు, నాటకీయ అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మధ్య కాలం విడుదలైన సినిమా ట్రైలర్స్ తో పోలిస్తే 'పరదా' ట్రైలర్ కొత్తగా, రిఫ్రెషింగ్ గా ఉంది. అలాగే స్క్రీన్ ప్లే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ వాతావరణాన్ని, కథలోని భావోద్వేగాలను చక్కగా ప్రజెంట్ చేశారు. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తన కథల్లో గ్రామీణ నేపథ్యాన్ని, అక్కడి పరిస్థితులను ప్రధానంగా చూపిస్తుంటారు. 'పరదా' కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తోంది.
CRAZY TRAILER IN RECENT TIMES 🔥🔥🔥💥💥💥🙌🙌🙌🙌@anupamahere ONE WOMEN SHOW ALL OVER ❤️🔥❤️🔥❤️🔥🔥🔥🔥 #ParadhaTrailer#Paradha#AnupamaParameswaran
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) August 9, 2025
pic.twitter.com/MsRrTJtSjZ
ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా కీలక పాత్రను పోషించారు. ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. రీసెంట్ గా టిల్లూ స్క్వేర్, డ్రాగన్ వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న అనుపమ.. ఇప్పుడు 'పరదా' తో మరో హిట్టు కొట్టబోతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు. 'పరదా' లో ఒక పల్లెటూరి అమ్మాయిగా అనుపమ నటన ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో పాటు అనుపమ తమిళ్, మలయాళంలో పలు సినిమాలు చేస్తోంది. మలయాళంలో పెట్ డిటెక్టివ్ , లాక్‌డౌన్.. తమిళ్లో బైసన్ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఆఅ సినిమాతో టాలీవుడ్ లో అడుపెట్టిన అనుపమ పలు సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.