మాస్టర్‌‌ను పెళ్లి చేసుకుందామంటే అక్కకు తెలిసిపోయింది.. ఆడియో లీక్

జానీ మాస్టర్‌ కేసులో మరో ట్విస్ట్‌ ఎదురైంది. జానీ డ్రైవర్‌కు, బాధితురాలికి మధ్య జరిగిన ఫోన్‌ ఆడియో లీక్ అయింది. ఆ ఆడియోలో ఆయన్ను నేను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుందామంటే అక్కకు తెలిసిపోయింది అని బాధితురాలు మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాయి.

New Update

జానీ మాస్టర్‌ కేసులో మరో ట్విస్ట్‌ ఎదురైంది. జానీ డ్రైవర్‌కు, బాధితురాలికి మధ్య జరిగిన ఫోన్‌ ఆడియో రెండు పార్టులుగా లీక్ అయింది. ఆ ఆడియోలో ఆయన్ను నేను ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుందామంటే అక్కకు తెలిసిపోయింది అని బాధితురాలు మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాయి. నా జ్ఞాపకాలను నేను పోస్ట్‌ చేస్తాను అని కూడా ఆడియోలో వినిపిస్తుంది.

నా ప్రతి బర్త్‌డేకు మాస్టర్‌ గుర్తొస్తారు

అంతేకాకుండా నా మూడ్‌ కూడా బాలేదు.. అందుకే పాత వీడియోలను పెడుతున్నా అని ఆమె అందులో చెప్పుకొచ్చింది. నా ప్రతి బర్త్‌డేకు మాస్టర్‌ గుర్తొస్తారు.. కానీ ఇప్పుడు నాతో ఆయన మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ బాధితురాలి మాటల తర్వాత జానీ డ్రైవర్ మాట్లాడుతూ.. మాస్టర్‌ ఇచ్చిన ఉంగరం, నెక్లెస్‌ ఉంది కదా అని అన్నాడు. కావాలంటే ఆయననే ఇంటికొచ్చి తీసుకెళ్లమను అని బాధితురాలు తెలిపింది. నేను జానీ మాస్టర్‌కే ఇస్తానని.. అయితే నేను ఇచ్చిన వాచ్‌లు మాత్రం నాకు వద్దు అంటూ బాధితురాలు మాట్లాడినట్లు ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ప్రస్తుత ఆ ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసులో.. జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్!

కాగా ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయి ఇప్పుడు చంచల్ గూడా జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. రీసెంట్‌గానే ఆయనకు కాస్త ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా కోర్టు జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డుకు సెలక్ట్ అయిన తరుణంలో.. అతడు అవార్డు తీసుకోవడం కోసం కేవలం 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు అయింది.

కాగా జానీ మాస్టర్ తనను గత కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని.. మతం మార్చుకుని పెళ్లి కూడా చేసుకోమంటున్నాడని అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా జానీ భార్య సైతం తనను మతం మార్చుకోమని ఇబ్బంది పెట్టిందని కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

#jani-master
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe