Anirudh Ravichander Live Concert: హైదరాబాద్‌లో అనిరుధ్ జోష్.. 30 వేల టికెట్ల కోసం 1.5 లక్షల మంది పోటీ!

అనిరుధ్ రవిచందర్ తొలి హైదరాబాద్ లైవ్ కాన్సర్ట్ మార్చి 21, 2026న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. 30,000 టికెట్లకు 1.5 లక్షలకుపైగా డిమాండ్ రావడంతో టికెట్స్ వేగంగా సేల్ అవుతున్నాయి. 2000-6000 రేట్లు ఉన్నా అభిమానులు ఉత్సాహంగా బుక్ చేస్తున్నారు.

New Update
Anirudh Ravichander Live Concert

Anirudh Ravichander Live Concert

Anirudh Ravichander Live Concert: తమిళ రాక్ స్టార్ Anirudh Ravichander హైదరాబాద్‌(Hyderabad)లో తన తొలి లైవ్ కాన్సర్ట్ కు సిద్ధమవుతున్నారు. ఈ కాన్సర్ట్ పై అభిమానుల్లో ఊహించని స్థాయిలో ఉత్సాహం కనిపిస్తోంది. టికెట్లు బుకింగ్స్ ఓపెన్ కావడంతో వేగంగా బుక్ అవుతున్నాయి.

ఈ మ్యూజిక్ వేడుకను Sithara Entertainments నిర్వహిస్తోంది. మార్చి 21, 2026న సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ హైదరాబాద్‌లోని Gachibowli Indoor Stadium (అవుట్‌డోర్ గ్రౌండ్స్)లో జరుగుతుంది. సుమారు నాలుగు గంటల పాటు ఈ షో సాగనుంది.

మొత్తం 30,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే 1.5 లక్షలకుపైగా టికెట్ రిక్వెస్టులు వచ్చాయని సమాచారం. దీంతో టికెట్ కోసం భారీ పోటీ నెలకొంది. ప్రీ-రిజిస్ట్రేషన్ చేసిన వారికి ఫిబ్రవరి 19 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రీ-సేల్ ప్రారంభమవుతుంది. సాధారణ అమ్మకాలు ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతాయి.

టికెట్ ధరలు ₹2000 నుంచి ₹6000 వరకు ఉన్నాయి. ధరలు ఎక్కువైనా, డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇది అనిరుధ్‌కు తెలుగులో ఉన్న భారీ ఫాలోయింగ్‌.

ఈ టూర్‌కు ‘XV టూర్’ అనే పేరు పెట్టారు. అనిరుధ్ సంగీత ప్రయాణానికి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ ప్రత్యేక కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ‘Why This Kolaveri Di’ నుంచి తాజా హిట్ పాటల వరకు ఆయన సంగీత ప్రయాణం ఈ వేదికపై వినిపించనుంది.

మొత్తానికి, హైదరాబాద్‌లో ఈ కాన్సర్ట్ ఒక పెద్ద మ్యూజిక్ పండుగలా మారనుంది. టికెట్ పొందినవారికి ఇది మరపురాని అనుభవం కానుంది. మరి మీరు టికెట్ బుక్ చేసుకున్నారా..?

Advertisment
తాజా కథనాలు