Anee Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. అతని దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ గత కొన్నాళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని సెప్టెంబర్ 18న నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జానీని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం జానీ చెంచల్ గూడా జైల్లో ఉన్నాడు.
Also Read: డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఆ కారణంతోనే ఎలిమినేట్ కానున్నారా?
ఈ క్రమంలో సదరు లేడీ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్.. జానీ గురించి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు జరిగిన ఈ ప్రెస్ మీట్ లో అనీ.. జానీ మాస్టర్ గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు.
Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!
జానీ చాలా మంచి వ్యక్తి.. అనీ సంచలన విషయాలు
అనీ మాట్లాడుతూ.. "జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యానని. వారం రోజుల పాటు ఏం తోచని స్థితిలో ఉన్నానని.. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మీడియా ముందుకు రావాలని అనుకున్నాను. అందుకే ఈరోజు వచ్చానని తెలిపింది. జానీ మాస్టర్ నేషనల్ అవార్డును వెనక్కి తీసుకోవడం చాలా బాధాకరమని. నేరం రుజువు కాకముందే కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని.. కనీసం అవార్డును హోల్డ్ లో పెట్టాల్సిందని తన అభిప్రాయాన్ని చెప్పింది.
Also Read: ఫెమినా మిస్ ఇండియాగా నిఖిత పోర్వాల్.. రన్నరప్‌లుగా నిలిచింది వీళ్ళే
జానీ మాస్టర్ దగ్గర తాను రెండేళ్లు వర్క్ చేశానని.. ఇద్దరం షూటింగ్ కోసం ఇతర దేశాలు కూడా వెళ్ళమని.. అతను చాలా మంచి వ్యక్తని చెప్పింది. మీడియా ముందు జానీ మాస్టర్ మంచివాడు, గొప్ప వ్యక్తి అని చెప్పిన అమ్మాయి ఇలా కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. "
Also Read: 'రివాల్వర్ రీటా' వచ్చేసింది.. కీర్తి కొత్త మూవీ టీజర్ అదిరింది