/rtv/media/media_files/2025/08/29/lobo-2025-08-29-09-17-19.png)
lobo
Bigg Boss Lobo: బిగ్ బాస్ ఫేమ్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు జనగామ కోర్ట్ ఏడాది జైలు శిక్ష విధించింది. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్ వస్తుండగా నిడిగొండ ప్రాంతం వద్ద ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ ఇద్దరూ మృతి చెందారు. కారు కూడా బోల్తా పడడంతో లోబోతో పాటు కారులు ఉన్న పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేయగా.. విచారించిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. యాక్సిడెంట్ లో ఇద్దరు మరణించడంతో లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. రూ.12,500 జరిమానా విధించింది.
#Lobo is back!! ... Secret task effect valla badha lo #Shanmukh#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa#FiveMuchpic.twitter.com/v0JuQctokg
— Starmaa (@StarMaa) October 21, 2021
బిగ్ బాస్ సీజన్ 5
లోబో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ బాగా పాపులర్ అయ్యాడు. తన మాటలు, కామెడీతో ప్రేక్షకులను అలారించాడు. ఆ సీజన్ లో సీక్రెట్ రూం కి వెళ్లే ఛాన్స్ కూడా దక్కించుకున్నాడు లోబో. సీక్రెట్ రూం నుంచి హౌస్ మేట్స్ గేమ్ అంతా తెలుసుకునే అవకాశం.. వచ్చినప్పటికీ లోబో దానిని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. సీక్రెట్ రూం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా తన ఆట తీరులో ఎలాంటి కొత్తదనం చూపించలేదు. సీక్రెట్ రూం నుంచి వచ్చిన నెక్స్ట్ వారమే ఎలిమినెట్ అయ్యాడు.
రకరకాల టాటూలతో ఇన్ స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన లోబో అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ అడుగుపెట్టే అవకాశం పొందాడు. బిగ్ బాస్ తర్వాత లోబోకు మంచి ఆఫర్స్ వచ్చాయి. టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో మెరిసాడు. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించాడు.
Follow Us