patna event allu arjun
Pushpa 2: సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2'. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం మరో 15 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1000కి పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. రికార్డు వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ సందర్భంగా పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. సుమారు 2లక్షలకు పైగా అభిమానులు హాజరయ్యారు. రాష్ట్రం కానీ రాష్ట్రంలో 'పుష్ప' క్రేజ్ చూసి అంతా షాక్ అయ్యారు.
Also Read:'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!
థ్యాంక్యూ పాట్నా..
అయితే దీని పై అల్లు అర్జున్ స్పందించారు. లాంచ్ ఈవెంట్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హాజరు కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ఈవెంట్ పై స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ''థాంక్యూ పాట్నా ఫర్ ఆల్ ది లవ్'' అంటూ బన్నీ ట్వీట్ చేశారు.
Thank you Patna for all the love. 🖤 pic.twitter.com/KedCWpPC8g
— Allu Arjun (@alluarjun) November 18, 2024
Also Read : 900మంది పోలీసులు, 300మంది సెక్యూరిటీ.. హిస్టరీ క్రియేట్ చేసిన అల్లు అర్జున్
భారీ బందోబస్త్.. 900 మంది పోలీసులు
పాట్నాలో జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు భారీ బందోబస్త్ కేటాయించారు. ఒక ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బీహార్ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని కేటాయించడం ఇదే మొదటిసారి. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఈ ఈవెంట్ లో భద్రత సిబ్బందిగా ఉన్నారు.
Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ