Pushpa The Epic: "పుష్ప - ది ఎపిక్" రీ రిలీజ్ లేనట్టేనా..? బన్నీ - సుకుమార్ షాకింగ్ డెసిషన్..!

పుష్ప 1, 2ను రీ-కట్ చేసి రీ-రిలీజ్ చేయాలన్న ఫ్యాన్స్ ప్రపోజల్‌ను అల్లు అర్జున్, సుకుమార్ తిరస్కరించారు. పుష్ప 2 తాజాగా వచ్చినందున ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేయడం సరైందికాదని వారు భావించారు. సుకుమార్ రామ్‌చరణ్ సినిమా తర్వాత పుష్ప 3పై పని చేయనున్నారు.

New Update
Pushpa The Epic

Pushpa The Epic

Pushpa The Epic: ఇటీవల కాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేసే ట్రెండ్ బాగా పెరిగింది. తాజాగా నాగ్ మామ కల్ట్ క్లాసిక్ శివ 4k సినిమా రీ రిలీజై సూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ ట్రెండ్ లో పాత సినిమాలు మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన హిట్ చిత్రాలు కూడా పెద్ద ఎత్తున మళ్లీ విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా భారీ యాక్షన్ సినిమాలకు ఈ రీ-రిలీజ్ ట్రెండ్ కు బాగా పనిచేస్తోంది. ఉదాహరణగా, బాహుబలి సినిమాను ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎడిట్ చేసి రిలీజ్ చేయగా, 50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

ఈ విజయాన్ని చూసి, పుష్ప ఫ్యాన్స్ కూడా ఇదే విధంగా పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2లను కట్ చేసి ఒక స్పెషల్ వెర్షన్‌గా రీ-రిలీజ్ చేయాలనే ప్లాన్ చేశారు. ఈ ప్రతిపాదనను అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌కు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఇద్దరూ ఈ ఆలోచనను మర్యాదపూర్వకంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది.

దీనికి ప్రధాన కారణం - పుష్ప 2 గత ఏడాదే విడుదల కావడం. ఇండస్ట్రీలో మాట్లాడుతున్న టాక్ ప్రకారం, సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ ఇలా తాజాగా వచ్చిన సినిమాను మళ్లీ వెంటనే థియేటర్లలో పెట్టడం సరైన నిర్ణయం కాదని భావించారు. కానీ బాహుబలి అయితే దాదాపు 10 ఏళ్ల పాత సినిమా కావడంతో, ప్రేక్షకులలో ఇంకా భారీ క్రేజ్ ఉంది. అందుకే రీ-రిలీజ్ అక్కడ పనిచేసింది.

అదే విధంగా, సుకుమార్ ప్రస్తుతానికి చాలా బిజీగా ఉన్నారు. ఆయన ఈ ప్రత్యేక కట్ పనులను చూసుకోవడానికి కూడా టైమ్ లేకపోవడంతో, రీ-రిలీజ్ ప్లాన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లలేకపోయారని సమాచారం. దీంతో పుష్ప రీ-రిలీజ్‌పై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం లేదని ఖచ్చితంగా చెబుతున్నారు.

ఇకపోతే, సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాకే ఆయన పుష్ప 3 కథపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారని టాక్. అదే సమయంలో, అల్లు అర్జున్ కూడా అట్లీ డైరెక్ట్ చేస్తున్న తన నూతన సినిమాను ముగించిన తర్వాతే మళ్లీ పుష్ప ఫ్రాంచైజ్‌కి వస్తారని తెలుస్తోంది. మొత్తానికి, ఫ్యాన్స్ ఆశించినట్టు పుష్ప ప్రత్యేక రీ-రిలీజ్ త్వరలో జరగకపోయినా, పుష్ప మూడో భాగం కోసం సుకుమార్ - బన్నీ కాంబినేషన్ మళ్లీ కలవబోతున్నామన్న సూచనలు మాత్రం అభిమానులను ఉత్సాహపరుస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు