Pushpa 2 Japan Release: జపాన్ లో 'పుష్ప'గాడి రూల్..! రిలీజ్ ఎప్పుడంటే..?

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ జనవరి 16న జపాన్‌లో ‘పుష్ప కున్రిన్’ పేరుతో విడుదల కానుంది. ప్రమోషన్ల కోసం బన్నీ కుటుంబంతో టోక్యో చేరుకున్నారు. ఇప్పటికే ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా జపాన్ మార్కెట్‌పై ఆశలు పెంచుతోంది.

New Update
Pushpa 2 Japan Release

Pushpa 2 Japan Release

Pushpa 2 Japan Release:  ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘పుష్పరాజ్’ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అల్లు అర్జున్(Allu Arjun) నటించిన భారీ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ జనవరి 16న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా జపాన్‌కు వెళ్లారు. ఆయన తన కుటుంబంతో కలిసి టోక్యోలో అడుగుపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Pushpa 2 Japan Release

సోమవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి కనిపించారు. అక్కడి నుంచి టోక్యోకు బయల్దేరిన బన్నీ, జపాన్ రాజధానిలో సురక్షితంగా చేరుకున్నారు. టోక్యోలోని తన హోటల్ గది నుంచి నగర అందాలను చూపిస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట  వైరల్ అవుతున్నాయి.

జపాన్‌లో ఈ సినిమాను ‘పుష్ప కున్రిన్’ (Pushpa Kunrin) అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అక్కడి ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అయ్యేలా టైటిల్‌ను మార్చినట్లు సమాచారం. జపాన్‌లో ఈ చిత్రాన్ని ‘గీక్ పిక్చర్స్’, ‘షోచికూ’ అనే ప్రముఖ పంపిణీ సంస్థలు కలిసి విడుదల చేస్తున్నాయి. భారీ థియేటర్లలో, ప్రత్యేక షోస్‌తో సినిమాను అక్కడ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ ఇప్పటికే భారతదేశంలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 5, 2024న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అల్లు అర్జున్ నటన, స్టైలిష్ లుక్, డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో రష్మిక మందన్న నటించిన జాతర ఎపిసోడ్ ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. అలాగే ఫహాద్ ఫాజిల్ చేసిన పవర్‌ఫుల్ పాత్రకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ‘పుష్ప’ ఫ్రాంచైజ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ జపాన్‌లో కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు జపాన్‌లో విడుదలతో ‘పుష్ప 2’ మరో మార్కెట్‌ను చేరుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. జపాన్ ప్రేక్షకులు పుష్పరాజ్‌ను ఎలా స్వీకరిస్తారో, అక్కడ సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు