'పుష్ప 2' సంబరాలు షురూ.. అల్లు అర్జున్, సుకుమార్, దేవి ఫొటోలు వైరల్ !

అల్లు అర్జున్ 'పుష్ప2' ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. 15 గంటల్లోనే ఏకంగా 42 మిలియన్ల వ్యూస్‌ తో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో పుష్ప టీమ్ సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా బన్నీ, సుకుమార్, దేవి, చంద్రబోస్, మేకర్స్ కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update

Allu Arjun pushpa2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ 'పుష్ప 2' ట్రైలర్ నెట్టింట దుమ్మురేపుతోంది. 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కేవలం 15 గంటల్లోనే ఏకంగా 42 మిలియన్ల వ్యూస్ తో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్  మూవీ ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'పుష్ప' పేరే వినిపిస్తోంది, కనిపిస్తోంది. ట్రైలర్ లో అల్లు అర్జున్ విజువల్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా  బన్నీ మ్యానరిజం పార్ట్ 1 మించి ఉంది. 

Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ

పుష్ప 2 టీమ్ సంబరాలు.. 

ట్రైలర్ కు సూపర్ హిట్ రెస్పాన్స్ రావడంతో  'పుష్ప' టీమ్ సంబరాలు చేసుకుంటున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పుష్ప టీమ్.. హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, లిరిసిస్ట్ చంద్రబోస్, దేవి శ్రీ ప్రసాద్, మేకర్స్ కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఈ ఫొటోను చంద్రబోస్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. #వైల్డ్ ఫైర్ అంటూ ట్వీట్ చేశారు.  

Also Read :  పోసానికి బిగ్ షాక్.. సీఐడీ కేసు నమోదు 

ఇది ఇలా ఉంటే .. 24 గంటలు పూర్తయ్యేసరికి ట్రైలర్ 50 మిలియన్ల వ్యూస్ అందుకోవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుమారు 2:48 నిమిషాల నిడివితో ఉన్నఈ ట్రైలర్ ఫ్యాన్స్ తో పాటూ నార్మల్ ఆడియన్స్ ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటిరా? ఇంటర్నేషనల్.. పుష్ప2 ట్రైలర్ అరాచకం..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు