అల్లు అర్జున్ పై కేసు.. నేడు హైకోర్టులో తుది తీర్పు

ఏపీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో నంద్యాల పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ కేసుకు సంబంధించి ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెలువ‌రించ‌నుంది.

New Update
Allu Arjun: వయనాడ్‌ బాధితులకు అల్లు అర్జున్ సాయం.. రూ. 25 లక్షల విరాళం

allu arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ ఎన్నికల సమయంలో తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా అల్లు అర్జున్ అనుమతి లేకుండా  జనసమీకరణ చేశారనే ఆరోపణలతో ఆయన పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. దీని పై ఐకాన్ స్టార్ స్పందిస్తూ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు. 

నేడే తుది తీర్పు 

అల్లు అర్జున్ పిటీషన్ స్వీకరించిన ధర్మాసనం ఈ కేసు పై గత నెల 25న విచారణ జరిపింది.  ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవద్దని పోలీసుల‌ను ఆదేశించడంతో పాటు... నవంబరు 6న తుది తీర్పు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నేపథ్యంలో నేడు ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ శిల్పా రవికి సపోర్ట్ గా ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీలో చిచ్చు రేపింది. అప్పటి నుంచి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇప్పటికీ  సోషల్ మీడియాలో ప్రచారం  జరుగుతోంది. 

Also Read:Kiccha Sudeep: హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాదం.. పవన్ కళ్యాణ్ ట్వీట్

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం మరో 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రష్మిక కథానాయికగా నటించగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్

Advertisment
తాజా కథనాలు