ఓటీటీలో ఒబామా మెచ్చిన 'All We Imagine As Light'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

'All We Imagine As Light' ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హాట్ స్టార్ పోస్టర్ రిలీజ్ చేసింది.

author-image
By Archana
New Update
'All We Imagine As Light' ott

All We Imagine As Light ott release

All We Imagine As Light:  భారతీయ దర్శకురాలు పాయల్‌ కపాడియా తెరకెక్కించిన 'All We Imagine As Light' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ముంబై నర్సింగ్ హోమ్ లో  పనిచేసే కేరళకు చెందిన  ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే ఈ కథ అనేక అవార్డులను సొంతం చేసుకుంది.  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా  'గ్రాండ్‌ పిక్స్‌' అవార్డు గెలుచుకుంది. దాదాపు 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ అవార్డు దక్కించుకున్న తొలి  భారతీయ చిత్రం ఇది. అంతేకాదు ఈ సినిమా 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులకు కూడా ఎంపికైంది. బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ నాన్‌ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ మోషన్‌ పిక్చర్  విభాగాల్లో  గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యింది.

Also Read:  2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా?

ఓటీటీ స్ట్రీమింగ్.. 

ఇలా అద్భుతమైన కథాంశంతో అనేక ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హాట్ స్టార్ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో కనికుశ్రుతి, దివ్య ప్రభ, చాయాకదం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రానా ప్రజెంట్ చేశారు. 

ఆస్కార్ కోసం

ఆస్కార్ 2025 అవార్డు కోసం భారత దేశం నుంచి 'All We Imagine As Light'  ఎంపిక కావాలని చాలా మంది విమర్శకులు మరియు అభిమానులు వాదించారు. అయితే దీనిపై  FFI జ్యూరీ మాట్లాడుతూ..  పాయల్ కపాడియా 'All We Imagine As Light'  చిత్రం సాంకేతికంగా చాలా పేలవంగా ఉందని పేర్కొంది.

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు