Aishwarya Rai: మోదీకి పాదాభివందనం చేసిన నటి ఐశ్వర్యారాయ్‌.. వీడియో వైరల్!

పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఐశ్వర్య రాయ్ ప్రసంగం ఆకట్టుకుంది. మానవత్వం, ప్రేమ, సేవే నిజమైన విలువలు అని ఆమె చెప్పి, ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. బాబా బోధనలు ప్రపంచానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

New Update
Aishwarya Rai

Aishwarya Rai

Aishwarya Rai: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు నవంబర్ 18న ఎంతో ఘనంగా జరిగాయి. హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

మోదీకి పాదాభివందనం చేసిన ఐశ్వర్య

వేదికపై ప్రసంగం ముగిసిన వెంటనే ఐశ్వర్య రాయ్, ప్రధాని నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సన్నివేశం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. తరువాత ప్రసంగించిన ఆమె, బాబా బోధనలు తన జీవితంపై ఎంతో ప్రభావం చూపాయని, అవి తనకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని చెప్పింది.

“మానవత్వమే అసలు మతం”  ఐశ్వర్య హృదయానికి హత్తుకునే మాటలు తన ప్రసంగంలో ఐశ్వర్య రాయ్ సత్యసాయి బాబా చెప్పిన ప్రధాన తత్త్వాలను మరోసారి గుర్తు చేసింది. ఆమె చెప్పిన మాటలు సభలో ప్రశంసలు అందుకున్నాయి

  • “మనిషికి ఒకే జాతి ఉంది, అది మానవ జాతి.”
  • “ఒకే మతం ఉంది, అది ప్రేమ.”
  • “హృదయ భాషే నిజమైన భాష.”
  • “ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన సర్వవ్యాప్తుడు.”

ఈ మాటలు కార్యక్రమానికి వచ్చిన భక్తులు, శ్రోతల హృదయాలను తాకాయి.

నిజమైన నాయకత్వం అంటే సేవ అని ఐశ్వర్య రాయ్ తెలిపింది. ప్రధాని మోదీ గురించి కూడా ఐశ్వర్య రాయ్ ప్రత్యేకంగా పేర్కొంది.

“మోదీ గారి రాక ఈ వేడుకకు మరింత పవిత్రతను ఇచ్చింది. నిజమైన నాయకత్వం అంటే సేవ చేయడం. మనిషికి సేవ చేయడం అంటే దేవునికి సేవ చేసినట్టే. ఈ సందేశాన్ని స్వామి ఎప్పుడూ చెప్పేవారు.” సత్యసాయి బోధనలు ఎప్పటికీ నిలిచిపోతాయి.

1926లో జన్మించిన సత్యసాయి బాబా, ప్రేమ, కరుణ, అహింస, నీతి వంటి మానవ విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన ఆధ్యాత్మిక గురువు. 2011లో ఆయన మరణించినప్పటికీ, ఆయన ఉపదేశాలు ఇంకా లక్షలాది మంది జీవితాల్లో మార్పులు తీసుకువస్తూనే ఉన్నాయి.

ఐశ్వర్య రాయ్ చివరిగా పొన్నియిన్ సెల్వన్ 2లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో ఆమె భావోద్వేగ ప్రసంగం, మోదీ పాదాలకు నమస్కరించిన క్షణం ఇవన్నీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమం సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, ఐక్యత, సేవ అనే విలువలను మరోసారి అందరికీ గుర్తు చేసింది.

Advertisment
తాజా కథనాలు