/rtv/media/media_files/2025/12/14/dacoit-teaser-2025-12-14-08-49-08.jpg)
Dacoit Teaser
Dacoit Teaser: యంగ్ హీరో అడివి శేష్, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘డాకోయిట్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఉగాది, ఈద్ పండుగ కానుకగా 2026 మార్చి 19న విడుదల కానుంది.
#DACOIT Teaser.
— Adivi Sesh (@AdiviSesh) December 13, 2025
2 Original Languages
2 Different Cities
ONE day.
DECEMBER 18th.
ఇటీవల అడివి శేష్ తన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 18, 2025న ‘డాకోయిట్’ టీజర్ విడుదల కానుందని తెలిపారు. ఈ టీజర్‌ను రెండు భాషల్లో, అలాగే రెండు నగరాల్లో ప్రత్యేకంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. టీజర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ఆయన చెప్పారు.
‘డాకోయిట్’ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమాకు సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. యాక్షన్, సస్పెన్స్‌తో పాటు బలమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ‘డాకోయిట్’ టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow Us