/rtv/media/media_files/2025/10/28/dacoit-2025-10-28-14-00-20.jpg)
Dacoit
Dacoit: అడివి శేష్(Adivi Sesh), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటిస్తున్న ద్విభాషా యాక్షన్ డ్రామా 'డకోయిట్' విడుదల తేదీ మారింది. మొదట ఈ సినిమా 2025 డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, షూటింగ్ సమయంలో అడివి శేష్‌కు యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయం కావడంతో చిత్రబృందం విడుదలను వాయిదా వేసింది. హీరో పూర్తిగా కోలుకుని మిగిలిన సన్నివేశాలను పూర్తి చేయడానికి సమయం కావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మూవీ టీమ్ తెలిపింది.
ఇప్పుడు నిర్మాతలు కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. 'డకోయిట్' మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఉగాది, ఈద్ పండుగల సందర్భంలో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తూ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించారు.
ఈ సినిమాకు షనైల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన తొలి చిత్రం. సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మారీ ఖాన్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
'డకోయిట్'లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. వీరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టీమ్ చెబుతోంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ చిత్రం ప్రేమ, యాక్షన్ అంశాలను మేళవించి థ్రిల్లింగ్ కథగా రూపొందుతున్నదట. అడివి శేష్ గాయపడిన తర్వాత మళ్లీ ఫిట్‌గా మారి షూటింగ్‌లో పాల్గొని మూవీ కంప్లీట్ చేసినట్టు మూవీ టీం తెలిపింది.
మార్చి 19న విడుదల కానున్న 'డకోయిట్'తో అడివి శేష్ మరో బ్లాక్‌బస్టర్ ఇవ్వబోతున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. కొత్త పోస్టర్, రిలీజ్ డేట్‌తో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.
Follow Us