Tripti Dimri: రణబీర్‌ క్యారెక్టర్‌ని ఎందుకు దూషించరు? తను మగాడనా?.. త్రిప్తి అదిరిపోయే రిప్లై

యానిమల్, బ్యాడ్ న్యూస్ సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ లో సెమీ న్యూడ్‌గా నటించిన మిమ్మల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించిన నెటిజన్ కు నటి త్రిప్తి ఘాటుగా రిప్లై ఇచ్చింది. "మరి రణబీర్‌ క్యారెక్టర్‌ని ఎందుకు దూషించరు? మగాడనా? అంటూ కౌంటర్ ఇచ్చింది".

New Update
tripti

Tripti Dimri

 

 నయా నేషనల్ క్రష్, బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ యానిమల్ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ ముద్దు గుమ్మ. యానిమల్ సక్సెస్ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న త్రిప్తి..  ఇటీవలే విక్కీ కౌశల్ సరసన 'బ్యాడ్ న్యూస్' సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టింది. ఈ ఏడాది జులై 19న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ కాసుల వర్షం కుపించింది. ఈ సినిమాలోని తన అందాలతో మరోసారి  ప్రేక్షకులను కట్టిపడేసింది త్రిప్తి. 

Also Read: Sleep: పగటి పూట నిద్ర పొతే మీ బతుకు బస్టాండ్ అవుతుందా? ఇందులో నిజమెంత?

మగాడు ఎలాగైనా చేయొచ్చా..? 

ఇది ఇలా ఉంటే తాజాగా త్రిప్తికి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. 'యానిమల్', బ్యాడ్ న్యూస్ చిత్రాల్లో ఇంటెన్స్ సీన్స్ లో సెమీ న్యూడ్ గా నటించిన త్రిప్తిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా..? అని అడగగా..  దానికి త్రిప్తి ఘాటైన సమాధానమిచ్చింది. దీనికి  త్రిప్తి రిప్లై ఇస్తూ.. "మరి నాతో పాటు సెమీ న్యూడ్ గా నటించి.. ముద్దులతో రెచ్చిపోయిన రణబీర్‌ క్యారెక్టర్‌ని ఎందుకు దూషించడం లేదు? అతను మగాడనా..? మగవాళ్ళైతే ఎలాగైనా చేయొచ్ఛా?  సినిమాలో పాత్ర కోసం ఆడవాళ్లు చేస్తే పాపమా..? సినిమాల్లో నటించినట్లే నిజ జీవితంలోనూ ఉంటామని ఎలా నిర్ణయిస్తారు..? ఎలాంటివి చూడాలి.. ఎలాంటివి చూడకూడదు అనే పూర్తి హక్కు ప్రేక్షకులకు ఉంది. కానీ ఎదుటి వ్యక్తిని దూషించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. ముందు మగాళ్లను, ఆడవాళ్లను వేరు చేసి చూడడం, మాట్లాడడం మానుకోండి. ఆన్ స్క్రీన్ పై చేసే రొమాంటిక్ సన్నివేశాల్లో ఆడ, మగ ఇద్దరిదీ సమాన పాత్రేనని గ్రహించండి అంటూ ఘాటుగా బదులిచ్చింది. "

 Also Read: Devara: తెలుగు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న 'జానూ పాప' వీడియో..!

Advertisment
Advertisment
తాజా కథనాలు