Samantha: 'ఏ మాయ చేసావే' సినిమాతో ప్రేమలో పడిన సామ్- నాగచైతన్య.. కొన్నేళ్ల ప్రేమించుకున్న తర్వాత 2017లో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేస్తున్నారు. వివాహం తర్వాత నాలుగేళ్ళ పాటు కలిసున్నా వీరిద్దరూ.. మనస్పర్థలతో 2021లో విడిపోయారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇక సమంతతో విడిపోయిన మూడేళ్లకు నాగచైతన్య కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. ఇటీవలే నటి శోభిత దూళిపాలతో నిశ్చితార్థం చేసుకొని.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
Also Read: 'కంగువ' కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. ఊహించని విధంగా రన్ టైం !
నాగచైతన్య కు సమంత లీగల్ నోటీసులు
ఈ క్రమంలో సమంత నాగచైతన్యకు లీగల్ నోటీసులు పంపిందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే గతంలో సామ్- చై ఇద్దరు కలిసి ఒక ప్లాట్ కొనుగోలు చేసి తమ ఇష్టాలకు అనుగుణంగా దానిని డిజైన్ చేయించుకున్నారట. పెళ్లి తర్వాత వాళ్ళు ఇష్టంగా డిజైన్ చేయించుకున్న ఆ ప్లాట్ లోనే ఉన్నారట. ఈ ప్లాట్ కొన్నప్పుడు చైతన్య కంటే సామ్ కాస్త ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిందట. దీనికి సంబంధించే సామ్ ఇప్పుడు తన మాజీ భర్తకు లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే శోభితతో పెళ్ళైన తర్వాత నాగ చైతన్య అదే ప్లాట్ లో ఉండబోతున్నారట. అలాగే చై ఆ ప్లాట్ కూడా శోభిత పేరు పై రాయడానికి సిద్దపడ్డారట. అందుకే సమంత.. ఎంతో ఖర్చు పెట్టి ఇష్టంగా డిజైన్ చేయించుకున్న ఇల్లును శోభితకు రాసివ్వడం ఏంటని.. నాగచైతన్యకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు పలు వెబ్ సైట్లట్లో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది మాత్రం తెలియదు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
Also Read: RGV: ఇది వారికి వినోదం మాత్రమే..! నాగచైతన్య- శోభిత పెళ్లి పై ఆర్జీవీ కామెంట్స్