నా ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది.. ఆ సందేశాలకు స్పందించకండి : నయనతార

కోలీవుడ్ న‌టి న‌య‌న‌తార త‌న ఎక్స్ ఖాతా హ్యాక్ అయిన‌ట్లు తెలిపింది. త‌న అకౌంట్ నుంచి వ‌చ్చే సందేశాలకు స్పందించకండి అంటూ ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చింది. అకౌంట్ హ్యాక్‌పై సైబ‌ర్ పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేశాన‌ని త్వ‌ర‌లోనే మీ ముందుకు వస్తానని వెల్లడించింది.

nayanthara
New Update

Actress Nayanthara :

 ఈ మ‌ధ్య సినీ సెలెబ్రిటీల సోష‌ల్ మీడియా అకౌంట్స్ హ్యాక్‌కు గురవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరో, హీరోయిన్స్ ఇన్ స్టా, ఎక్స్ అకౌంట్స్ హ్యాక్ అవ్వగా.. తాజాగా ఈ లిస్ట్ లో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం చేరింది. న‌య‌న‌తార తాజాగా త‌న ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయిన‌ట్ల తెలిపింది.

ఈ మేరకు త‌న అకౌంట్ నుంచి వ‌చ్చే సందేశాలకు కానీ, ట్విట్ల‌కు కానీ స్పందించకండి అంటూ ఎక్స్ వేదిక‌గా రాసుకోచ్చింది. త‌న అకౌంట్ హ్యాక్‌పై సైబ‌ర్ పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేశాన‌ని త్వ‌ర‌లోనే మీ ముందుకు వస్తానని వెల్లడించింది.

ఇక నయనతార సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. గత ఏడాది షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తమిళ్ తో పటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. టెస్ట్ సినిమాతో పాటు త‌ని ఒరువ‌న్ పార్ట్ 2, మ‌న్న‌న్‌గ‌ట్టి 1960, డియ‌ర్ స్టూడెంట్స్ ఇలా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.

#nayanthara
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe